ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి...

First Published Feb 9, 2021, 9:21 AM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుతంగా రాణించినా ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపిక కాలేకపోయిన కుర్రాళ్లకు ఇంగ్లాండ్ సిరీస్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున రాణించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లతో పాటు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తిలను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయాలని చూస్తోంది బీసీసీఐ.

9 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్, గత మూడు సీజన్లలో 400+ పైగా పరుగులు చేసి ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా నిలిచాడు. 2018 సీజన్‌లో 512 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 2019లో 424, 2020లో 480 పరుగులు చేశాడు.
undefined
ఐపీఎల్ ప్రదర్శన తర్వాత భారతజట్టులో సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కడం గ్యారెంటీ అనుకున్నారంతా. అయితే ఆసీస్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో యాదవ్‌కి స్థానం దక్కలేదు. దీంతో సెలక్టర్లపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కానీ ఛాన్స్ వచ్చేదాకా ఓపిగ్గా ఎదురుచూడాలని సూచించారు సచిన్ టెండూల్కర్, కోచ్ రవిశాస్త్రి...
undefined
అలాగే ఐదు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా గత సీజన్‌లో అదరగొట్టాడు. 14 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలతో 516 పరుగులు చేసి, టైటిల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్.
undefined
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్‌లో 99 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్‌కి కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్‌కి భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్‌కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి, గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వరుణ్ చక్రవర్తి స్థానంలో టీ20లకు ఎంపికైన నటరాజన్, వన్డేల్లో, టీ20ల్లో, టెస్టు సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి అద్భుత పదర్శనతో ఆకట్టుకున్నాడు...
undefined
ఐపీఎల్ 2020 సీజన్‌లో 13 మ్యాచులు ఆడి 17 వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తిని కూడా ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపిక చేయబోతున్నట్టు సమాచారం. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సమక్షంలో శిక్షణ పొందుతున్నారు.
undefined
వీరితో పాటు ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన భారత పేసర్ నవ్‌దీప్ సైనీ కూడా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉన్నాడు. టీ20 సిరీస్ సమయానికి సైనీ కోలుకుంటే, అతను జట్టుకి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఆసీస్ టూర్‌లో టీ20ల్లో అద్భుతంగా రాణించిన నటరాజన్‌కి కూడా ఈ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కి ఎంపిక చేసే అవకాశం ఉంది.
undefined
click me!