టీమిండియా సక్సెస్ క్రెడిట్ గ్రెగ్ చాపెల్‌కే దక్కుతుంది... మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కామెంట్స్...

First Published Jun 17, 2021, 12:18 PM IST

భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏరీ కోరీ తెచ్చి పెట్టిన గ్రెగ్ చాపెల్ కారణంగానే, అతను కెప్టెన్సీ కోల్పోయి, జట్టులో నుంచి దూరం కావాల్సి వచ్చింది. అయితే చాపెల్ కారణంగానే భారత జట్టు ఇంత పటిష్టంగా తయారైందని అంటున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...

సౌరవ్ గంగూలీకి, గ్రెగ్ చాపెల్ మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గంగూలీకి బద్ధకం చాలా ఎక్కువని, అసలు కష్టపడేవాడు కాదని, కేవలం జట్టులో ఆధిక్యం చెలాయించడం కోసం కెప్టెన్సీ కావాలని కోరుకునేవాడని గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
undefined
చాపెల్ కామెంట్లపై సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. ‘తన జీవితంలో చేసిన తప్పు ఏదైనా ఉంది ఉంటే, అది గ్రెగ్ చాపెల్‌ను కోచ్‌గా ఎంపిక చేయడమే’ అంటూ కామెంట్ చేశాడు...ఈ ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్థలు ఎలా ఉన్నా, చాపెల్ వల్లే జట్టు దృఢంగా తయారైందని అంటున్నాడు రైనా...
undefined
‘మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ భారత జట్టులో ఎన్నో సంచలన మార్పులు చేశాడు. టీమిండియా కోచ్‌గా అతని కెరీర్ వివాదాస్పదమై ఉండొచ్చు కానీ చాపెల్ నేర్పించిన పాఠాలే భారత జట్టును టాప్ టీమ్‌గా నిలిచేలా చేశాయి...
undefined
గ్రెగ్ చాపెల్, మాకు గెలుపు ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మించడం వల్ల పెద్ద విజయాలు ఎలా సొంతం చేసుకోవచ్చో వివరించాడు...
undefined
చాపెల్ కోచింగ్‌లో మేం చాలా బాగా ఆడాం. చేజింగ్‌లో రికార్డు విజయాలను కూడా అందుకున్నాం. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో వరుసగా అత్యధిక మ్యాచుల్లో చేధించి, విజయాలు అందుకున్నాం...
undefined
దీనికి ప్రధాన కారణం లక్ష్యచేధనలో భాగస్వామ్యాలను ఎలా నిర్మించాలో చాపెల్ మాకు నేర్పించారు. మేం ఆయన చెప్పిన దాన్ని పక్కగా ఫాలో అయ్యాం. అందుకే రిజల్ట్ కనిపించింది...
undefined
వాస్తవానికి చాపెల్ కోచ్‌గా వ్యవహారిస్తున్న సమయంలోనే నేను టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చా. ఆయన సీనియర్లతో పాటు జూనియర్ ప్లేయర్లకు తగిన ప్రాధాన్యం ఇచ్చేవారు...
undefined
అయితే అప్పుడ జట్టు వాతావరణం సరిగా ఉండేది కాదు. సీనియర్లు, జూనియర్లను చులకనగా చూసేవాళ్లు. కొందరైతే ర్యాగింగ్ చేసేవాళ్లు...
undefined
ఓ రోజు మ్యాచ్ కోసం నేను ప్రాక్టీస్ చేస్తుంటే, ఓ సీనియర్ ప్లేయర్ వచ్చి నన్ను ఎగతాళి చేశాడు. నువ్వు ఒక్కడివే మ్యాచ్ ఆడుతున్నావా? అంటూ వెటకారంగా అన్నాడు. అయితే నేను, ఆయన్ని కూడా నాతో కలిసి ప్రాక్టీస్ చేయమని కోరా...
undefined
అప్పట్లో కొందరు సీనియర్లు చాలా పొగరుగా మాట్లాడేవాళ్లు. జూనియర్ ప్లేయర్లు విష్ చేసినా తిరిగి విష్ చేయడం వారికి నచ్చేది కాదు... అయితే అలాంటి వాటికి బాధపడకూడదని చాపెల్ చెప్పారు...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా.
undefined
గ్రెగ్ చాపెల్ కోచింగ్‌లో ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత 2007 వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే నిష్కమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడడంతో భారత జట్టు, సూపర్ 8కి కూడా క్వాలిఫై కాలేకపోయింది.
undefined
ఈ టోర్నీ తర్వాత కోచ్‌గా గ్రెగ్ చాపెల్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే బీసీసీఐ తనకు కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చిందని... భారత జట్టులోని కొందరు సీనియర్లు, అభిమానుల నుంచి వచ్చే బెదిరింపుల వల్ల తాను కొనసాగడానికి ఇష్టపడలేదని చెప్పాడు చాపెల్.
undefined
click me!