భువనేశ్వర్ కుమార్ టైం అయిపోయింది, ఇక ఆ బౌలర్లను ప్రయత్నిస్తే బెటర్... సునీల్ గవాస్కర్ కామెంట్...

First Published Jan 22, 2022, 3:45 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2019 వరకూ టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. జస్ప్రిత్ బుమ్రాతో కలిసి పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసేవాడు భువీ. అయితే ఆ భువీ ఇప్పుడు కనిపించడం లేదు...

గాయం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌తో పాటు 2021 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోయాడు భువనేశ్వర్ కుమార్...

ఈ కారణంగానే భువనేశ్వర్ కుమార్‌కి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో పర్యటించిన భారత జట్టులో చోటు కూడా దక్కలేదు...

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్న భువనేశ్వర్ కుమార్, మొదటి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు...

అదీకాకుండా రెండు వన్డేల్లోనూ 64, 67 పరుగులు సమర్పించాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ, పవర్ ప్లేలో వికెట్ తీసే భువీ నుంచి ఈ రకమైన పర్ఫామెన్స్ రావడం, ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

జస్ప్రిత్ బుమ్రా ఒక్కడు రాణిస్తున్నా, అతనికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం అందడం లేదు. ఇదే భారత జట్టు ఓటములకు కారణమవుతోంది...

‘భువనేశ్వర్ కుమార్, భారత క్రికెట్‌లో ఓ అద్భుతమైన బౌలర్. కానీ కొన్నేళ్లుగా అతని పర్పామెన్స్ బాలేదు. కనీసం ఐపీఎల్‌లో కూడా సరిగా రాణించలేకపోతున్నాడు...

ఒకప్పుడు అద్భుతమైన యార్కర్లతో, స్లో బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టేవాడు భువనేశ్వర్ కుమార్. కానీ ఇప్పుడు అతని బౌలింగ్‌లో మునుపటి మెరుపులు కనిపించడం లేదు...

అతని బౌలింగ్ యాక్షన్ చూస్తుంటే ఇప్పట్లో అతను ఇంతకుముందులా బౌలింగ్ చేయగలడనే నమ్మకం కూడా కలగడం లేదు...

టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలు దగ్గర పడుతున్నాయి. కాబట్టి వన్డేల కోసం దీపక్ చాహార్, ఆవేశ్ ఖాన్ వంటి బౌలర్లను సిద్ధం చేస్తే మంచిది...

దీపక్ చాహార్‌ కూడా భువీలా పరుగులు నియంత్రించగలడు, అవసరమైతే లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేయగలడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...  

click me!