ఐపీఎల్ 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టే ప్లేయర్లు వీరే... ఇషాన్ కిషన్, డేవిడ్ వార్నర్‌తో పాటు...

First Published Jan 22, 2022, 2:32 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. టీమిండియా, సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ ఓడిన తర్వాత ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన వార్తను విడుదల చేసింది బీసీసీఐ. 1214 మంది ప్లేయర్లు మెగా వేలానికి రిజిస్టర్ చేయించుకోగా వీరిలో కోట్లు కొల్లగొట్టే ప్లేయర్లు లిస్టు కూడా భారీగానే ఉంది...

ఇషాన్ కిషన్: ముంబై ఇండియన్స్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌, ఈ సారి మెగా వేలంలో అత్యధిక ధర దక్కించుకునే ప్లేయర్ అవుతారని భావిస్తున్నారు ఫ్యాన్స్... మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌నే మలుపు తిప్పే ఇషాన్ కిషన్‌ కోసం అన్ని జట్లు పోటీపడే అవకాశం ఉంది...

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 2016లో ఐపీఎల్ టైటిల్ అందించాడు డేవిడ్ వార్నర్. అదీకాకుండా వరుసగా ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్‌కి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు... 

ఐపీఎల్‌లో కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ఆర్‌సీబీ, కేకేఆర్ జట్లు... డేవిడ్ వార్నర్ కోసం మెగా వేలంలో ప్రయత్నించడం ఖాయం. ఎంత లేదన్నా వార్నర్ భాయ్‌కి ఈసారి రూ.12-రూ.15 కోట్ల వరకూ ధర పలకవచ్చని అంటున్నారు విశ్లేషకులు...

యజ్వేంద్ర చాహాల్: ఆర్‌సీబీలో కీలక స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌ను ఈసారి ఆ జట్టు అట్టిపెట్టుకోలేదు. దీంతో మెగా వేలానికి వచ్చిన చాహాల్‌ కోసం అన్ని జట్లు పోటీ పడే అవకాశం బాగా ఉంది. చాహాల్‌కి ఎంత లేదన్నా రూ.8 నుంచి రూ.12 కోట్ల వరకూ ధర పలకవచ్చు...

శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఈ యంగ్ కెప్టెన్ కోసం కేకేఆర్, ఆర్‌సీబీతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడే అవకాశం ఉందని సమాచారం...

ఆవేశ్ ఖాన్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ సెన్సేషనల్ పేసర్ ఆవేశ్ ఖాన్. సీజన్‌లో హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఈ యంగ్ పేసర్ కోసం అన్ని జట్లు పోటీపడవచ్చు. లక్ కూడా కలిసి వస్తే ఆవేశ్ ఖాన్, వేలంలో రూ.12 కోట్లకు పైగా ధర దక్కించుకోవచ్చని అంచనా...

జానీ బెయిర్ స్టో: ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్లేయర్లలో జానీ బెయిర్ స్టో. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన బెయిర్ స్టో కోసం కూడా వేలంలో మంచి పోటీ జరగనుంది...

హర్షల్ పటేల్: సీజన్‌లో ఏకంగా 32 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు హర్షల్ పటేల్. బ్యాటుతో కూడా రాణించగల హర్షల్ పటేల్‌, ఈసారి వేలంలో భారీ ధర దక్కించుకోవడం గ్యారెంటీ...

కగిసో రబాడా:  డెత్ ఓవర్లలో పరుగులను కంట్రోల్ చేసే బౌలర్‌కి ఎంత ధర అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉంటాయి ఫ్రాంఛైజీ.  కగిసో రబాడా స్పెషాలిటీ ఇదే. రబాడా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడడం గ్యారెంటీ...

శిఖర్ ధావన్: ఐపీఎల్‌లో గత మూడు సీజన్లుగా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు గబ్బర్ ధావన్. గత సీజన్‌లోనూ 500+ పరుగులు చేసిన ధావన్ కోసం సన్‌రైజర్స్‌తో సహా అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది...

దీపక్ చాహార్: ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు దీపక్ చాహార్. బ్యాటుతో కూడా రాణించడం మొదలెట్టిన దీపక్ చాహార్ కోసం ఈసారి ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశం ఉంది... 

దేవ్‌దత్ పడిక్కల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్. రెండు సీజన్లలోనూ ఆకట్టుకున్న ఈ ఓపెనర్‌ కోసం మెగా వేలంలో ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది.

click me!