ఆ సీనియర్లు కూడా గంగూలీ తిరిగి టీమ్‌లోకి రావొద్దనుకున్నారు... గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు...

First Published Nov 1, 2021, 8:33 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2020 టోర్నీలో టీమిండియా పర్ఫామెన్స్ చూసిన తర్వాత, 14 ఏళ్ల కిందటి 2007 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ గుర్తుకువచ్చింది చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌ని. అప్పుడు అలాగే, టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగి, గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది భారత జట్టు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా పర్ఫామెన్స్, భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ, ఐపీఎల్‌పై విమర్శలు రావడానికి కారణమైతే.. అప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అప్పటి హెడ్‌కోచ్ గ్రేగ్ చాపెల్... 

వన్డే వరల్డ్‌కప్ 2003లో అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగి, అత్యద్భుత విజయాలతో ఫైనల్ చేరింది టీమిండియా. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయం పాలైన, భారత జట్టు చూపించిన పోరాట పటిమ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. 

ఆ టోర్న తర్వాత టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ,ఏరి కోరి ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్‌ని హెడ్‌కోచ్‌గా తెచ్చుకున్నాడు. అయితే ఈ ఇద్దరి మధ్య వైరం, ఆ టైంలో చాలా హాట్ టాపిక్ అయ్యింది...

గ్రెగ్ చాపెల్‌ని హెడ్‌కోచ్‌గా ఎంచుకోవడమే తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద పొరపాటుగా చెప్పాడు సౌరవ్ గంగూలీ. అవసరమైనప్పుడల్లా గంగూలీపై కామెంట్లు చేసే చాపెల్, మరోసారి ఓ సంచలన ఆరోపణ చేశాడు...

‘2005లో భారత జట్టు ఓ ట్రైయాంగిల్ వనడే సిరీస్ కోసం ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లింది. స్లో ఓవర్ రేటు కారణంగా సౌరవ్ గంగూలీపై వేటు పడింది... దాంతో అతను లంక టూర్‌కి అందుబాటులో లేడు...

అప్పటి బీసీసీఐ బాస్ జగన్మోహన్ దాల్మియా, నా దగ్గరికి వచ్చి ‘గ్రెగ్, మీరు గంగూలీ ఈ టూర్‌లో కావాలని అనుకుంటే, మేం ఎలాగోలా ఆడిస్తాం’ అని చెప్పారు...

నేను దానికి ‘ఎందుకు, ఐసీసీ నియమాన్ని మార్చడం ఎందుకు. అదీకాకుండా గంగూలీ లేకుండా రాహుల్ ద్రావిడ్ జట్టును ఎలా నడిపించగలడో తెలుసుకోవడానికి ఇదో మంచి అవకాశం. చూద్దాం...’ అని చెప్పాను...

నా సమాధానంలో దాల్మియా సంతోషించాడు. గంగూలీ లేకుండానే మేం శ్రీలంక టూర్‌కి వెళ్లాం. గంగూలీ లేకుండా భారత జట్టు చాలా బాగా ఆడింది. లంక పర్యటనలో రెగ్యూలర్ కెప్టెన్ గంగూలీ లేని లోటు కనిపించనే లేదు..

అయితే టూర్ మధ్యలో సౌరవ్ గంగూలీపై ఐసీసీ విధించిన బ్యాన్ ముగిసింది. దీంతో అతను జట్టుకి అందుబాటులోకి వచ్చాడు. అప్పుడు నేను కొందరు సీనియర్లను అడిగి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా...

గంగూలీ తిరిగి జట్టులోకి తీసుకోవాలా? అని కొందరు సీనియర్లను అడిగాను. వాళ్లు ‘వద్దు, అవసరం లేదు’ అని తేల్చి చెప్పేశారు. అయితే సెలక్టర్లు మాత్రం గంగూలీని తిరిగి జట్టులోకి తీసుకున్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు గ్రెగ్ చాపెల్...

జాన్ రైట్ తర్వాత 2005 టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న గ్రెగ్ చాపెల్, తన రెండేళ్ల కోచింగ్ పీరియడ్‌లో అనేక వివాదాలను ఎదుర్కొన్నాడు. అందులో గంగూలీ, చాపెల్ వివాదం తీవ్ర దుమారం రేపింది...

‘నేను టీమిండియా కోచ్‌గా రావడానికి గంగూలీయే కారణం. అతనే నన్ను ఆ విషయం గురించి అడిగాడు. ఆ సమయంలో ఓ బలమైన జట్టుకి కోచ్‌గా చేయాలని ఆలోచిస్తున్నా. గంగూలీ వల్లే ఆ అవకాశం దక్కింది...

అయితే ఆ రెండేళ్లు చాలా ఛాలెంజింగ్‌గా సాగింది. భారత జట్టుపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సౌరవ్ గంగూలీ ప్లేయర్‌గా ఫెయిల్ అవుతున్నాడు... సక్సెస్ కావాలనే ప్రయత్నం కూడా అతను చేయలేదు...

క్రికెట్‌ మారుతున్నా, తనని తాను మెరుగుపర్చుకోవడానికి గంగూలీ ఎప్పుడూ ఇష్టపడలేదు. కేవలం జట్టుకి కెప్టెన్‌గా మాత్రమే ఉండాలని అనుకున్నాడు. అందుకే అతనితో నాకు గొడవలు జరిగాయి...

లక్కీగా భారత జట్టులోని సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ, భారత క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు... వారి సహకారంతోనే రాహుల్ ద్రావిడ్‌కి కెప్టెన్సీ ఇచ్చాం...’ అంటూ చెప్పుకొచ్చాడు గ్రెగ్ చాపెల్... 

click me!