పరాజయం నుంచి కోలుకోకముందే టీమిండియాకి మరో ఎదురుదెబ్బ... ఇషాంత్ శర్మకి గాయం...

First Published Jun 25, 2021, 11:33 AM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ పరాజయం నుంచి కోలుకోకముందే, టీమిండియాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్ చేతికి గాయమైంది...

రెండో ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, ఓ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు...
undefined
బలంగా దూసుకొచ్చిన ఆ బంతిని ఆపేందుకు చేయిని అడ్డంగా పెట్టాడు ఇషాంత్ శర్మ. బంతి బౌండరీ దాటకుండా అడ్డుకున్న ఇషాంత్ శర్మ, తన చేతికి గాయం చేసుకున్నాడు...
undefined
ఇషాంత్ శర్మ చేతి నుంచి రక్తం కారడంతో ఆ ఓవర్‌ను జస్ప్రిత్ బుమ్రా పూర్తి చేయాల్సి వచ్చింది... తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో గాయపడడం కూడా ఓ విధంగా టీమిండియా విజయావకాశాలను దెబ్బతీశాయి.
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పూర్తిచేసుకున్న టీమిండియా, సౌంతిప్టన్ నుంచి లండన్ బయలుదేరింది. అక్కడ 42 రోజుల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేయబోతున్నారు భారత క్రికెటర్లు...
undefined
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆగస్టు 4న ప్రారంభం కానుంది. అంటే ఇషాంత్ శర్మకు గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఆరువారాల సమయం ఉంది...
undefined
ఇషాంత్ శర్మ కోలుకోకపోయినా, లేదా కోలుకున్నప్పటికీ తనకి తగినంత విశ్రాంతి అవసరమని టీమిండియా భావించినా... అతని స్థానంలో మహ్మద్ సిరాజ్ లేదా శార్దూల్ ఠాకూర్‌ని ఆడేంచే అవకాశం ఉంది.
undefined
బీసీసీఐ సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్ రజల్ అరోరా, లండన్ ట్రైన్‌లో తన గాయపడిన చేతితో విచారంగా కూర్చున్న ఇషాంత్ శర్మ ఫోటోను షేర్ చేసింది.
undefined
click me!