కెప్టెన్ నెంబర్ 8... ఆగస్టులో జింబాబ్వే టూర్‌కి టీమిండియా! కొత్త కెప్టెన్ వేటలో బీసీసీఐ...

Published : Jul 09, 2022, 05:08 PM IST

2022లో టీమిండియా సాధించిన విజయాల కంటే కూడా మార్చిన కెప్టెన్ల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు భారత జట్టు ఎలా ఆడుతుందా? అని ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్,ఇప్పుడు తర్వాతి సిరీస్‌కి కెప్టెన్ ఎవరు ఉంటారా? అని బెట్టింగులు వేసుకుంటున్నారు... 7 నెలల్లో ఏడుగురు కెప్టెన్లను మార్చేసిన భారత జట్టు, మరో కొత్త కెప్టెన్ వేటలో పడిందట...

PREV
17
కెప్టెన్ నెంబర్ 8... ఆగస్టులో జింబాబ్వే టూర్‌కి టీమిండియా! కొత్త కెప్టెన్ వేటలో బీసీసీఐ...

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ సిరీస్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ కలిసి వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు...

27

జనవరి 17న ఇంగ్లాండ్ టూర్ ముగించుకునే భారత జట్టు, ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది. విండీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కి ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతి కల్పించింది భారత జట్టు... ఈ సిరీస్‌కి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

37

2022 ఏడాదిలో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించబోయే 7వ సారథి శిఖర్ ధావన్. ఇప్పటికే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా ... కెప్టెన్లుగా ఒక్కో సిరీస్ ఆడిన భారత జట్టు, రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడు సిరీస్‌లు ఆడింది...
 

47

వెస్టిండీస్ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడే భారత జట్టు, ఆ తర్వాత ఆగస్టు 18 నుంచి జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18న తొలి వన్డే, 20న రెండో వన్డే, 22న జరిగే మూడో వన్డేతో ఈ పర్యటన ముగుస్తుంది..

57
Image credit: Getty

ఆగస్టు నెలఖరున శ్రీలంకలో ఆసియా కప్ 2022 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత లంకకి చేరుకుంటుంది భారత ప్రధాన జట్టు. దీంతో భారత బీ టీమ్, జింబాబ్వేలో పర్యటించనుంది...

67

ఈ పర్యటనకు ఓ కొత్త కెప్టెన్‌ని వెతికే పని పడిందట భారత క్రికెట్ బోర్డు. ఆసియా కప్ 2022 టోర్నీకి ప్రకటించిన జట్టులో లేని ప్లేయర్లలో సీనియర్‌కి టీమిండియా కెప్టెన్సీ దక్కొచ్చని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

77
Sanju Samson

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్‌కి లేదా భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కి జింబాబ్వే టూర్‌లో టీమిండియా కెప్టెన్సీ దక్కొచ్చని సమాధానం. శాంసన్‌కి కెప్టెన్సీ దక్కితే ఈ ఏడాదిలో టీమిండియాకి కెప్టెన్సీ చేయబోయే 8వ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories