తప్పలేదు! ఏం చేద్దాం... టీమిండియా కెప్టెన్ల మార్పులపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

Published : Jul 09, 2022, 03:52 PM IST

మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉంటే అది న్యూజిలాండ్, పాకిస్తాన్... వైట్ బాల్‌కి, రెడ్ బాల్ ఫార్మాట్‌కి వేర్వేరుగా ఇద్దరు కెప్టెన్లు ఉంటే.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక! ఒక్కో సిరీస్‌కి ఒక్కో కెప్టెన్‌ని మారుస్తూ పోతే మాత్రం అది కచ్చితంగా టీమిండియానే... విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది..

PREV
18
తప్పలేదు! ఏం చేద్దాం... టీమిండియా కెప్టెన్ల మార్పులపై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...
Rohit Sharma

2022లో ఏడు నెలల సమయం గడిస్తే ఇప్పటికే ఏడుగురు కెప్టెన్లను వాడేసింది టీమిండియా. గత రెండు నెలల్లో సిరీస్‌కో కెప్టెన్‌ని మారుస్తూ ‘మ్యూజికల్ ఛైర్స్’గేమ్ ఆడుతోంది భారత క్రికెట్ బోర్డు...

28
Image credit: Getty

సౌతాఫ్రికా టూర్‌కి ముందు వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ దక్కింది... కేప్‌టౌన్ టెస్టు తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ...

38

స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌ నుంచి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోగా కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కెప్టెన్సీ ఛాన్స్ యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి దక్కింది...

48

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. టీమిండియా మెయిన్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు...

58

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కి శిఖర్ ధావన్‌ కెప్టెన్సీ చేయబోతున్నట్టు ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు. సిరీస్‌కో కెప్టెన్‌ని మారుస్తున్న బీసీసీఐ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జట్టులో ఉన్న యజ్వేంద్ర చాహాల్, శ్రేయాస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్లేయర్లకు కూడా కెప్టెన్సీ ఇచ్చేస్తే సరిపోతుందని ట్రోల్స్ వస్తున్నాయి...

68
Image credit: PTI

తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ల ‘మ్యాజికల్ ఛైర్స్’ గేమ్‌పై స్పందించాడు. ‘ఇంత తక్కువ సమయంలో ఏడుగురు కెప్టెన్లను మార్చడం నిజంగా కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ కావాలని చేయలేదు, చేయాల్సి వచ్చింది...

78

తప్పని పరిస్థితుల్లో కెప్టెన్లను మారుస్తూ వచ్చాం. రోహిత్ శర్మ గాయపడకపోతే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి కెప్టెన్సీ చేసేవాడు. అలాగే కెఎల్ రాహుల్ గాయపడకపోతే స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌కి కెప్టెన్‌గా ఉండేవాడు...

88

వార్మప్ మ్యాచ్‌ సమయంలో రోహిత్ శర్మ కరోనా బారిన పడతాడని ఎవ్వరైనా ఊహించారా? పరిస్థితుల ప్రభావంతో కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది. అయితే ఇది ప్లేయర్లపై వర్క్‌ లోడ్ తగ్గిస్తుంది... ’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ..

Read more Photos on
click me!

Recommended Stories