ఐదుగురిలో నలుగురికి డిజాస్టర్ రిజల్ట్స్... టీమిండియాకి కలిసిరాని కొత్త కెప్టెన్లు...

First Published Jul 5, 2022, 10:18 PM IST

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ ఓ మ్యూజికల్ ఛైర్స్ ఆటలా తయారైంది. ఏడాది కాలంలో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన వారి సంఖ్య 8 మంది. అయితే వీరిలో కొత్త కెప్టెన్లు ఐదుగురు. వీరిలో ఐర్లాండ్‌పై టీ20 సిరీస్ ఆడిన హార్ధిక్ పాండ్యా మినహా మిగిలిన నలుగురు కెప్టెన్లకు కెప్టెన్సీ ఏ మాత్రం కలిసి రాలేదు...

Image Credit: Getty Images

2021 జూన్‌లో భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన సమయంలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది...

అయితే కరోనా కేసుల సంఖ్యల భారత జట్టులోని 8 మంది కీ ప్లేయర్లు దూరం కావడంతో ఆఖరి రెండు టీ20 మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌తో ఆడింది ధావన్ టీమ్. దీంతో 2-1 తేడాతో టీ20 సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. శ్రీలంకపై టీ20 సిరీస్ ఓడిపోయిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు శిఖర్ ధావన్...

రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్. ఈ సిరీస్‌లో వెన్నునొప్పితో విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో  జోహన్‌బర్గ్‌ టెస్టులో కెప్టెన్సీ చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్. 

జోహన్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్ ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్న కెఎల్ రాహుల్, వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యి... గత 60 ఏళ్లల్లో వరుసగా 4 మ్యాచుల్లో ఓడిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్...

Rishabh Pant

సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సమయానికి ముందు కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పకోవడంతో సఫారీ సిరీస్‌కి కెప్టెన్సీ చేసే అవకాశం దక్కించుకున్నాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది...

Image credit: PTI

అయితే రస్సీ వాన్ దేర్ దుస్సేర్, డేవిడ్ మిల్లర్ కారణంగా 19.1 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి పడేసింది సౌతాఫ్రికా... టీ20ల్లో 200+ పైగా స్కోరు చేసిన తర్వాత ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రిషబ్ పంత్...

మరోసారి రోహిత్ శర్మ కారణంగా టీమిండియా కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సి వచ్చింది ఇంగ్లాండ్ టూర్‌లో. టీమిండియాతో రాకుండా ఆలస్యంగా జట్టుతో కలిసిన రోహిత్ శర్మ, ఐదో టెస్టు ఆరంభానికి ముందు కరోనా పాజిటివ్‌గా తేలాడు. మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి రోహిత్ కోలుకోకపోవడంతో జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు...

Image Credit: Getty Images

తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుని, ప్రత్యర్థి ముందు 377 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టిన తర్వాత కూడా భారత జట్టు పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. టెస్టుల్లో 350+ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా...

తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకుని, ప్రత్యర్థి ముందు 377 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టిన తర్వాత కూడా భారత జట్టు పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. టెస్టుల్లో 350+ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు జస్ప్రిత్ బుమ్రా...

click me!