భారత జట్టును చూస్తుంటే అప్పటి పాక్ టీమ్ గుర్తుకువస్తోంది... పాక్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యలు...

First Published Nov 7, 2020, 6:37 PM IST

IPL 2020 సీజన్ తుదిదశకు చేరుకుంది. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్‌లో నాలుగు టెస్టు మ్యాచులు, మడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. త్వరలో జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్.

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో కచ్ఛితంగా ఆసీస్ ఫెవరెట్ అవుతుంది.. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నాయి...
undefined
ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, హజల్‌వుడ్ వంటి స్టార్ పేసర్లతో ఆస్ట్రేలియా జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. స్వదేశంలో సిరీస్ కాబట్టి ఆసీస్‌కి అనుకూలం కావచ్చు.
undefined
అయితే భారత జట్టు ఎంతో దృఢంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో పూర్తి విశ్వాసంతో బరిలో దిగుతోంది భారత క్రికెట్ జట్టు...
undefined
బుమ్రా వంటి ప్రపంచస్థాయి అత్యుత్తమ పేసర్‌ భారత జట్టులో ఉన్నాడు. అంతేనా షమీ, ఇషాంత్ శర్మలను తక్కువ చేయడానికి లేదు...
undefined
అదీగాక భారత జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, రహానే, పూజారా, ధావన్ ప్రపంచంలో ఏ పిచ్‌పైన అయినా ధారాళంగా పరుగులు చేయగలరు...
undefined
అందుకే భారత జట్టు ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తోంది. ఇప్పటి భారత జట్టును చూస్తుంటే 90 దశకంలోని పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌లా కనిపిస్తోంది...
undefined
ఆ టైమ్‌లో నాతో పాటు వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ వంటి టాప్ క్లాస్ బౌలర్లు పాక్ జట్టులో ఉండేవాళ్లు... ఇప్పుడు భారత జట్టు అలాగే కనిపిస్తోంది... అంటూ వ్యాఖ్యానించాడు వసీమ్ అక్రమ్.
undefined
ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు భారత క్రికెటర్లు చాలా తేడాగా తయారయ్యారని, కొరకరాని కొయ్యలుగా మారారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అక్రమ్.
undefined
పాక్ క్రికెట్ టీమ్ తరుపున 104 టెస్టు మ్యాచులు ఆడిన వసీమ్ అక్రమ్... 414 వికెట్టు తీశాడు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీసిన అక్రమ్... క్రికెట్ వ్యాఖ్యతగా కూడా రాణిస్తున్నారు.
undefined
click me!