ఢిల్లీ, సన్‌రైజర్స్... ఫైనల్‌లో ముంబైని కొట్టే సత్తా ఎవ్వరికి ఉంది...

First Published Nov 7, 2020, 4:43 PM IST

IPL 2020 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి ఫైనల్ చేరింది ముంబై ఇండియన్స్. ఆదివారం జరిగే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, మంగళవారం ముంబైతో ఫైనల్ ఫైట్‌తో తలబడుతుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఏ జట్టుకి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని ఓడించే సత్తా ఉంది.

ఈ సీజన్‌లో మూడు సార్లు ముంబై ఇండియన్స్‌తో తలబడింది ఢిల్లీ క్యాపిటల్స్. మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీకి పరాభవమే మిగిలింది.
undefined
సీజన్‌లో రెండోసారి తలబడిన మ్యాచ్‌తో పాటు కీలకమైన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కనీస పోరాట ప్రటిమ కూడా ప్రదర్శించలేకపోయింది యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్న కసిగో రబాడా...మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు, అదీగాక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
undefined
ఢిల్లీ జట్టుకి ప్రధాన బలమైన పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్... అందరూ ముకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు...
undefined
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నా మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆరెంజ్ ఆర్మీని బాగా వేధిస్తోంది.
undefined
అయితే వరుసగా నాలుగు విజయాలు అందుకుని ఊపుమీదున్న సన్‌రైజర్స్... టాప్ క్లాస్ టీమ్‌లను చిత్తు చేసి ప్లేఆఫ్స్‌కి చేరింది. మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో దక్కిన విజయం వారికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వొచ్చు.
undefined
ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఛాంపియన్ టీమ్‌గా అవతరించాలని కసిగా ఆడుతోంది.
undefined
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి భారీ హిట్టర్లు... పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లు ఉన్న ముంబైని ఫైనల్ మ్యాచ్‌లో ఓడించడం అంత ఈజీ కాదు.
undefined
ఐపీఎల్‌లో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ను ఫైనల్ మ్యాచ్‌లోతలబడేటప్పుడు ఏ జట్టుకైనా కొంచెం ఒత్తిడికి గురికావడం సహజం...
undefined
మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ వైఫల్యానికి కారణం ఈ ఒత్తిడే. ఆరంభ మ్యాచుల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చే ఢిల్లీ, కీలక మ్యాచుల్లో ప్రెషర్‌ను తట్టుకోలేక చిత్తుగా ఓడుతోంది.
undefined
సీజన్‌ను ఓటమితో ప్రారంభించినా కీలక మ్యాచుల్లో గెలిచి... సెకండ్ క్వాలిఫైయర్ దాకా దూసుకొచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్...ఎలా చూసినా ఢిల్లీ కంటే సన్‌రైజర్స్‌కి ముంబైని ఓడించే సత్తా ఉన్నట్టు అనిపిస్తోంది.
undefined
అయితే ఢిల్లీ మెంటర్ రికీ పాంటింగ్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌. రెండు సార్లు ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపిన పాంటింగ్, తన కెప్టెన్సీలో 67 శాతానికి పైగా విజయాలను అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పురోగతికి కారణం రికీ పాంటింగే.
undefined
ఢిల్లీ టీమ్‌లో ఉన్న ప్లేయర్లు కూడా మామూలు ఆటగాళ్లు కాదు. వరుసగా విఫలమవుతున్న పృథ్వీషా నుంచి హెట్మయర్ దాకా అందరూ భారీ సంచలన ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లు. తమదైన రోజున ఎలాంటి బౌలర్లకైనా చుక్కలు చూపించే సత్తా వీరికి ఉంది.
undefined
ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. లేటుగా ఎంట్రీ ఇచ్చినా ఓ సారి ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా వరుసగా ఐదు సీజన్లలో ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది సన్‌రైజర్స్... ముంబై టైటిల్ గెలిచిన సీజన్లలో ఆ జట్టుకి మెంటర్ రికీ పాంటింగ్‌యే.
undefined
13 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నా ఇప్పటిదాకా ఫైనల్ చేరని జట్టు ఢిల్లీ ఒక్కటే. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలిస్తే చూడాలనేది చాలామంది క్రికెట్ అభిమానుల ఆకాంక్ష. అయితే దానికి ఇంకొంత సమయం పడుతుందని విశ్లేషకుల అంచనా.
undefined
click me!