నా రోల్ మోడల్ ఆయనే కానీ క్రికెట్‌లోకి వచ్చాకే ఆ విషయం అర్థమైంది... సచిన్‌ టెండూల్కర్‌పై ధోనీ..

Published : Oct 14, 2022, 11:35 AM IST

క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నవారిలో సచిన్ టెండూల్కర్ తర్వాతి ప్లేస్ మహేంద్ర సింగ్ ధోనీదే. క్రికెట్ ‘మాస్టర్’ తర్వాత  మాస్‌ జనాల్లోకి అంతగా చొచ్చుకెళ్లిన క్రికెటర్ మాహీ. మరి ధోనీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరు? తాజాగా మాహీ ఈ విషయం గురించి ఓపెన్ అయ్యాడు...

PREV
15
నా రోల్ మోడల్ ఆయనే కానీ క్రికెట్‌లోకి వచ్చాకే ఆ విషయం అర్థమైంది... సచిన్‌ టెండూల్కర్‌పై ధోనీ..
sachin dhoni

2004లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 2007లో టీమిండియాకి టీ20 కెప్టెన్‌గా ఎంపికై మొట్టమొదటి ప్రపంచకప్‌ని గెలిచాడు. అప్పటి నుంచి భారత క్రికెట్‌లో మాహీ శకం ప్రారంభమైంది. దాదాపు దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌ని ఏలాడు ధోనీ..

25

ధోనీ కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు సచిన్ టెండూల్కర్. ఆరు వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన టెండూల్కర్, 2003లో టీమిండియాని ఫైనల్ చేర్చినా టైటిల్ గెలవలేకపోయాడు. ఎట్టకేలకు మాహీ కెప్టెన్సీలో సచిన్ వరల్డ్ కప్ కల నెరవేరింది..

35
Dhoni-Sachin

అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ వంటి కెప్టెన్ల కెప్టెన్సీలో ఆడిన సచిన్ టెండూల్కర్, తాను ఆడిన వారిలో ఎంఎస్‌ ధోనీయే బెస్ట్ కెప్టెన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాహీ టీమ్‌ని నడిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అతని కెప్టెన్సీలో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశానని అన్నాడు...

45
Dhoni sachin

తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ తన రోల్ మోడల్ గురించి కామెంట్లు చేశాడు... ‘క్రికెట్‌లో నా రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్. మీ అందరిలాగే నేను కూడా చిన్నతనం నుంచి సచిన్ టెండూల్కర్ ఆటను చూస్తూ పెరిగాను. సచిన్ సెంచరీ చేస్తే ఆనందంతో ఎగిరి గంతులేసేవాడిని...

55

పెద్దయ్యాక సచిన్ టెండూల్కర్‌లా ఆడాలని, ఆయన రికార్డులు బ్రేక్ చేయాలని అనుకునేవాడిని. అయితే టీమ్‌లోకి వచ్చాకే ఆయనలా ఆడడం ఎవ్వరివల్లా కాదని అర్థమైంది. ఆయనలా నేను ఆడలేను. అయితే ఆయనతో కలిసి ఆడడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తా...’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...

Read more Photos on
click me!

Recommended Stories