మంచి చెఫ్‌కి ఆ విషయాలు బాగా తెలుసు... సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ గొడవపై ప్రజ్ఞాన్ ఓజా...

First Published Dec 17, 2021, 11:09 AM IST

భారత క్రికెట్‌లో ఏం జరుగుతుందో తెలీదు, బోర్డుకి విరాట్ కోహ్లీకి మధ్య సంబంధాలు ఏ మాత్రం బాగోలేవని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు...

వన్డేల్లో సారథిగా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డులను పక్కనబెట్టి, ఐసీసీ టైటిల్ గెలవలేదనే వంకతో కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు...

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... ‘నేను స్వయంగా విరాట్‌ కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోకూడదని అడిగాను. అందుకే అతను ఒప్పుకోలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు.

అయితే విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్పిరెన్స్‌లో గంగూలీ కామెంట్లను కొట్టిపారేశాడు. ‘టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు ఎవ్వరూ వద్దని చెప్పలేదు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టుగా గంటన్నర ముందే చెప్పారు...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లతో సౌరవ్ గంగూలీపై, బీసీసీఐ సెక్రటరీ జై షాపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. భారత క్రికెట్ బోర్డులో రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు విరాట్ అభిమానులు...

సౌతాఫ్రికా టూర్‌కి ముందు విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లపై స్పందించడానికి సౌరవ్ గంగూలీ ఇష్టపడలేదు. ‘ఆ విషయాన్ని బీసీసీఐ డీల్ చేస్తుంది...’ అంటూ తేల్చేశాడు దాదా...

తాజాగా భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్  ప్రజ్ఞాన్ ఓజా ఈ విషయం గురించి ఓ వ్యంగ్య ట్వీట్ చేశాడు... ‘ఓ అమోఘమైన వంట వండుతున్నప్పుడు ఏది చూపించాలో, ఏది చూపించకూడదో ఓ మంచి చెఫ్‌కి బాగా తెలుస్తుంది. కొన్నిసార్లు రెస్టారెంట్, కిచెన్ పరువు, ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది...’ అంటూ ట్వీట్ చేశాడు  ప్రజ్ఞాన్ ఓజా...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఐసీసీ టోర్నీలు గెలుస్తుందని... అందుకే కెప్టెన్సీ మార్పు జరిగిందనే అర్థంలో  ప్రజ్ఞాన్ ఓజా ఈ ట్వీట్ వేశాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

బీసీసీఐ, తనతో ఇలా వ్యవహరించిందని... కేవలం గంటన్నర ముందే కెప్టెన్సీ నుంచి తప్పించిందని అభిమానులతో చెప్పి భారత క్రికెట్ పరువు తీయాల్సిన అవసరం ఏముందని విరాట్ కోహ్లీని ట్రోల్ చేశాడని అంటున్నారు మరికొందరు...

మొత్తానికి ప్రత్యేక్షంగా తన ట్వీట్ దేని గురించో చెప్పకపోయినా... ‘అనవసరం, నీ పనిపై దృష్టిపెడతావని ఆశిస్తున్నా.... ’ అంటూ ఇండియన్ క్రికెట్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించి మరో ట్వీట్ వేశాడు  ప్రజ్ఞాన్ ఓజా...

ఈ ట్వీట్ ద్వారా బీసీసీఐ విధానాలపై అనవసర ఆరోపణలు చేసే కంటే, సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు సిరీస్ గెలవడంపై దృష్టి పెట్టాలని విరాట్ కోహ్లీకి సూచిస్తున్నట్టు భావిస్తున్నారు అభిమానులు... 

click me!