గాయమన్నాడు, భార్య పేరిట 4 ఎకరాల భూమి కొన్నాడు... సౌతాఫ్రికా టూర్‌కి ముందు రోహిత్ శర్మ...

Published : Dec 17, 2021, 11:19 AM IST

సౌతాఫ్రికా టూర్‌కి ముందు భారత వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా ప్లైట్ ఎక్కని రోహిత్, భార్య రితికా పేరు మీద 4 ఎకరాల భూమి కొన్నాడట...

PREV
111
గాయమన్నాడు, భార్య పేరిట 4 ఎకరాల భూమి కొన్నాడు... సౌతాఫ్రికా టూర్‌కి ముందు రోహిత్ శర్మ...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కీలక మ్యాచుల్లో ఘోరంగా ఫెయిలై, భారత జట్టు ఓటమికి కారణమైన రోహిత్ శర్మ... ఆ తర్వాత టీ20 కెప్టెన్‌గా పగ్గాలు తీసుకున్న విషయం తెలిసిందే...

211

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, మూడు మ్యాచుల్లోనూ బ్యాటుతోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

311

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వన్డే కెప్టెన్‌గానూ పగ్గాలు రోహిత్‌కే అప్పగిస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ.

411

అయితే టూర్ ఆరంభానికి ముందు బీసీసీఐ మినీ క్యాంపులో గాయపడడంతో రోహిత్, దక్షిణాఫ్రికా టూర్‌కి వెళ్లలేదు.. అయితే ఈ గ్యాప్‌లో భార్య రితికా పేరట ముంబైలోని సౌత్ అలీబాగ్ ఏరియాలో నాలుగు ఎకరాల స్థలం కొన్నాడు రోహిత్...

511

ఈ భూమి ఖరీదు దాదాపు 9 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందట. అలీబాగ్‌ సిటీకి 20 కి.మీ.ల దూరంలో ఉన్న సరళ్ మహాత్రోలి అనే గ్రామంలో ఉన్న ఈ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ నెల 14న జరిగింది...

611

రిజిస్ట్రేషన్‌ సమయంలో భార్య రితికా శర్మతో పాటు రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లిన రోహిత్ శర్మ, ఆ తర్వాత కొన్న స్థలంలో కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు...

711

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియా కెప్టెన్సీ దక్కడంతో పాటు ఆరో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య రితికాకి విలువైన భూమిని బహుమతిగా ఇచ్చాడట రోహిత్ శర్మ...

811

అన్ని సరిగా ఉంటే 12న బీసీసీఐ క్యాంపులో క్వారంటైన్‌కి, ఆ తర్వాత మూడు రోజులకు డిసెంబర్ 15 సాయంత్రం ఛార్టెడ్ ఫ్లైయిట్‌లో సౌతాఫ్రికాకి వెళ్లాల్సింది రోహిత్ శర్మ...

911

ఆ టూర్‌ నుంచి తప్పుకోవడం, అదే సమయంలో రిజిస్ట్రేషన్ పెట్టుకోవడంతో నిజంగా రోహిత్ శర్మకు గాయమైందా? లేదా విదేశీ టూర్‌లో విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రోహిత్ కావాలని తప్పుకున్నాడా? అని అనుమానిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

1011

హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడని, అయితే వన్డే సిరీస్ సమయానికి కోలుకుంటాడని తెలిపింది బీసీసీఐ. అయితే హామ్‌స్ట్రింగ్ గాయం కోలుకోవడానికి ఎంత లేదన్నా 8 వారాల సమయం పడుతుందని తెలిపారు వైద్యులు...

1111

అదీకాకుండా హామ్‌స్ట్రింగ్ గాయమైనవాళ్లు, ఎక్కువగా కాలిపై ఒత్తిడి వేయకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రోహిత్ శర్మ మాత్రం రిజిస్ట్రేషన్, పూజ అంటూ తిరుగుతుండడంపై ట్రోల్స్ వస్తున్నాయి..

Read more Photos on
click me!

Recommended Stories