ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో పాల్గొంటున్న భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఈ టోర్నీ ప్రారంభానికి ముందు వారణాసి టూర్‌కి వెళ్లాడు...
గంగా నదిలో పడవ సవారి చేసిన ధావన్... గింజలను తీసుకెళ్లి వలస పక్షులకు ఆహారంగా వేశాడు. అంతేకాకుండా పక్షులకు మేత వేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు...
‘పక్షులకు ఆహారం వేయడమే అసలైన ఆనందం’ అంటూ కామెంట్ పెట్టి మరీ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు శిఖర్ ధావన్...
నిజానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో వారణాసిలో పక్షులకు మేత వేయడంపై నిషేధం ఉంది... ఈ విషయం తెలియని పర్యాటకులకు బోట్‌మెన్ చెప్పాల్సి ఉంటుంది...
అయితే భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన పడవ ఎక్కాడనే సంతోషంలో ఈ విషయాన్ని అతనికి చెప్పడం మరిచాడు సదరు పడవ నడిపే వ్యక్తి.
దీంతో శిఖర్ ధావన్ ప్రయాణించిన పడవ డ్రైవర్లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది వారణాసి కోర్టు...
నిజానికి ఇలాంటి పనులకు పాల్పడితే పర్యాటకులపై ఎలాంటి చర్యలు తీసుకోమని వారణాసి కలెక్టర్ తెలిపారు. అయితే సిద్ధార్థ్ శ్రీవాత్సవ అనే లాయర్, ధావన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు...
సోషల్ మీడియాలో శిఖర్ ధావన్ పక్షులకు మేత వేస్తున్న ఫోటోలు వైరల్ కావడంతో వాటినే పరిగణనలోకి తీసుకోవాలంటూ కోర్టుకి సూచించారు. లాయర్ ఛార్జ్‌షీట్‌తో ధావన్‌పై కేసు నమోదుచేసింది వారణాసి న్యాయస్థానం.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఫిబ్రవరి 6న జరగనుంది. ధావన్‌కి వారణాసిలో అమలులో ఉన్న నిబంధనల గురించి తెలిసే ఈ పనికి పాల్పడ్డాడా? బోట్‌మేన్ చెప్పినా వినకుండా చేశారా అనేది తేలాల్సి ఉంది...
ఒకవేళ బోట్‌మేన్ నిషేధం విషయాన్ని ధావన్‌కి చెప్పకపోయి ఉంటే, భారత ఓపెనర్ ఈ అనవసర చిక్కుల్లో నుంచి బయటపడతాడు. లేదంటే గబ్బర్ మరిన్ని చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.