బౌండరీలతో అదరగొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీస్తూ, డిఫెన్స్ ఆడుతూ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు కేదార్ జాదవ్...
అసలే మాత్రం పర్ఫామెన్స్ చూపించకపోయినా... కేవలం మహేంద్ర సింగ్ ధోనీకి ఆప్తుడైన కారణంగానే జాదవ్‌కి జట్టులో చోటు దక్కుతోందని కామెంట్లు వినిపించాయి...
మహేంద్ర సింగ్ ధోనీకి డ్రెస్సింగ్ రూమ్‌లో కేదార్ జాదవ్ తినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కేదార్‌కి జట్టులో చోటు దక్కడానికి ఇదే కారణమంటూ బీభత్సమైన విమర్శలు వచ్చాయి...
అయితే జాదవ్‌పై ట్రోలింగ్ విపరీతంగా పెరగడంతో సీజన్ మధ్యలోనే అతన్ని పక్కనబెట్టింది చెన్నై సూపర్ కింగ్స్... ఆఖరి ఆరు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచినా అప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌కి దూరమైంది సీఎస్‌కే...
‘మహేంద్ర సింగ్ ధోనీ చాలా స్పెషల్ కెప్టెన్. అతను ఎప్పుడూ సుదీర్ఘ ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు... జట్టు మొత్తాన్ని మార్చకుండా టీమ్‌ను పునరుద్దించడం ఎలాగో ధోనీకి బాగా తెలుసు...
ప్రతీ సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ అంచనాలు ఉంటాయి. గత సీజన్‌లో ప్లేఆఫ్ చేరకపోవడంతో సీఎస్‌కే, జట్టులో భారీ మార్పులు చేస్తుందని భావించారు... కానీ ధోనీ ఆలోచన వేరేగా ఉంది...
కేవలం ఐదుగురు ప్లేయర్లను మాత్రమే పక్కనబెట్టిన సీఎస్‌కే... అధిక ధర చెల్లించాల్సి వస్తున్నందుకే పియూష్ చావ్లా, కేదార్ జాదవ్‌ను వదిలించుకుంది... జాదవ్‌ను సగం రేటుకి కొనుగోలు చేసి ఉంటే అట్టిపెట్టుకునేది. ఈ ఇద్దరినీ మళ్లీ చెన్నై తీసుకోవచ్చు...’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు గౌతమ్ గంభీర్...
కేదార్ జాదవ్‌ను 2018లో ఏకంగా రూ.7 కోట్ల 80 లక్షలు పెట్టి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... అయితే అతను గత సీజన్‌లో 78 పరుగులు కూడా చేయలేకపోయాడు. మొత్తంగా 8 మ్యాచుల్లో 62 పరుగులే చేశాడు. స్ట్రైయిక్ రేటు 93.93 మాత్రమే.
పియూష్ చావ్లాను రూ.6 కోట్ల 75 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సీఎస్‌కే, అతన్ని కూడా మినీ వేలానికి వదిలేసింది...
మినీ వేలానికి ఏకంగా 10 మంది ప్లేయర్లను పక్కనబెట్టిన రాయల్ ఛాలెంజర్స్... ఆటగాళ్లలో అభద్రతా భావం పెంచుతోందని, జట్టుకి ఇది భారీ నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డాడు గౌతమ్ గంభీర్...
కేదార్ జాదవ్ (రూ.7.80 కోట్లు), పియూష్ చావ్లా (రూ. 6.75 కోట్లు), షేన్ వాట్సన్ (రూ.4 కోట్లు), మురళీ విజయ్ (రూ.2 కోట్లు), హర్భజన్ సింగ్ (రూ. 2 కోట్లు), మోను కుమార్ (రూ.20 లక్షలు)లను విడుదల చేసిన సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ నుంచి రాబిన్ ఊతప్పను రూ.3 కోట్లకు క్యాష్ డీల్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసింది.