మొదటి టెస్టులోనే నాతో అలా అన్నాడు... వీడేం మనిషిరా బాబు అనుకున్నా... రవిచంద్రన్ అశ్విన్...

First Published Jan 28, 2021, 4:13 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి, క్లాస్ బ్యాటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శుబ్‌మన్ గిల్. భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా అయ్యే సత్తా ఉన్న క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శుబ్‌మన్ గిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్...

మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో ఆరంగ్రేటం చేశాడు శుబ్‌మన్ గిల్... ఎంట్రీ మ్యాచ్‌లోనే మంచి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు గిల్.....
undefined
తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే మయాంక్ వికెట్ కోల్పోయినా ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం గిల్ ఇన్నింగ్స్‌లో కనిపించలేదు. 65 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసిన గిల్... ఎంట్రీ ఇన్నింగ్స్‌తోనే హాఫ్ సెంచరీ చేసే ఛాన్స్‌ కోల్పోయాడు...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 200 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా... నాలుగో ఇన్నింగ్స్‌లో 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించిన విషయం తెలిసిందే...
undefined
ఆసీస్ టెయిలెండర్ల వికెట్లు తీయడానికి భారత బౌలర్లు ప్రయత్నిస్తున్న సమయంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దగ్గరకి వచ్చిన శుబ్‌మన్ గిల్... ‘ఆశ్ భయ్యా... త్వరగా వాళ్లని ఆలౌట్ చేసేయండి... టార్గెట్ 50, 60 అయితే నేను 5 ఓవర్లలోనే కొట్టేస్తాను...’ అని చెప్పాడట.
undefined
మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న శుబ్‌మన్ గిల్, ఈ విధంగా మాట్లాడడం చూసి రవిచంద్రన్ అశ్విన్ షాక్ అయ్యాడట. ‘గిల్ మాటలు విని... వావ్ వీడు మామూలుగా కాదురా...’ అనుకున్నానని చెప్పాడు అశ్విన్.
undefined
రెండో ఇన్నింగ్స్‌లో కూడా మయాంక్ అగర్వాల్, పూజారా వికెట్లను త్వరగా కోల్పోయిన టీమిండియా... 15 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది...
undefined
36 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఎంట్రీ ఇచ్చి, ఆసీస్‌పై అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు గిల్...
undefined
నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే అవుటైనా... రెండో ఇన్నింగ్స్‌లో 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి భారత జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు శుబ్‌మన్ గిల్...
undefined
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో మూడు టెస్టులు ఆడి, అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రిషబ్ పంత్ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్. ఓవరాల్‌గా పంత్, రహానే, పూజారా తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు శుబ్‌మన్ గిల్.
undefined
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ప్రదర్శన ఆధారంగా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు శుబ్‌మన్ గిల్...
undefined
click me!