ఆ ఇద్దరూ టీమ్‌లో ఉంటే, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మనదే... పృథ్వీషా, రిషబ్ పంత్‌లపై వీరూ కామెంట్...

First Published May 21, 2022, 1:32 PM IST

టీమిండియాలోకి ఓ సంచలనంలా దూసుకొచ్చిన యంగ్ స్టర్ పృథ్వీషా. ఆరంగ్రేట మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన పృథ్వీషా, ఆడిలైడ్ టెస్టు పీడ కల తర్వాత మళ్లీ భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు... అయితే భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలవాలంటే పృథ్వీ షా జట్టులో తప్పక ఉండాలని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

పృథ్వీ షా బ్యాటింగ్ స్టైల్‌ని వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాల కలయికగా పేర్కొన్నాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఏ నిమిషాన ఈ కామెంట్లు చేశాడో కానీ అప్పటి నుంచి పృథ్వీషాకి పెద్దగా అవకాశాలు రాలేదు...

గత ఏడాది విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ, ఐపీఎల్‌లో అదరగొట్టినప్పటికీ పృథ్వీషాకి భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కలేదు. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టు కోసం పృథ్వీషాని పిలిపించినా, కరోనా కేసుల కారణంగా ఆ మ్యాచ్ కాస్తా సుదీర్ఘ వాయిదా పడింది...

Prithvi Shaw

‘టెస్టు క్రికెట్‌కి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. అయితే పృథ్వీషా లాంటి ప్లేయర్ టీమ్‌లో ఉంటే మళ్లీ టెస్టులకు ఆదరణ పెరుగుతుంది...

rishabh pant

పృథ్వీషాతో పాటు రిషబ్ పంత్ ఉంటే, ప్రత్యర్థి జట్టు 400 కొట్టినా సరిపోదని భయపడతారు. ఎందుకంటే ఈ ఇద్దరూ దూకుడుగా ఆడతారు. మొదటి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు...

రిషబ్ పంత్, పృథ్వీషా ఒకే టీమ్‌లో ఉంటే భారత జట్టుకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ అందించగలరు. టెస్టుల్లో భారత జట్టుకి తిరుగులేని ఆధిక్యం అందించగలరు...

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 50 లేదా 100 కొట్టాలనే ఉద్దేశంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడు. పరిస్థితులకు తగ్గట్టు టీమ్‌ని మంచి పొజిషన్‌లో పెట్టాలనే లక్ష్యంతోనే సాగుతాడు..

నెం.4, లేదా నెం 5 స్థానంలో బాధ్యత తీసుకునే ప్లేయర్లలో రిషబ్ పంత్ ఒకడు. అయితే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తే మరింత సక్సెస్ సాధిస్తాడు...

Rishabh Pant

నా వరకూ రిషబ్ పంత్, పృథ్వీషా కలిసి టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉంది. టీమిండియాకి కావాల్సిన ఫ్యూచర్ జనరేషన్ ఈ ఇద్దరే’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

click me!