సీఎస్‌కే, ముంబై, ఆర్‌సీబీ... ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఫైనల్‌కి రాజస్థాన్ రాయల్స్...

First Published May 21, 2022, 12:13 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఎంతో తెలివిగా ప్లేయర్లను కొనుగోలు చేసిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహాల్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి మ్యాచ్ విన్నర్లను వేలంలో కొనుగోలు చేసిన ఆర్ఆర్, అనుకున్నట్టుగానే లీగ్ స్టేజీలో అదరగొట్టి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది...

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, నెట్ రన్‌ రేట్ కారణంగా టాప్ 2లో పొజిషన్ ఖాయం చేసుకుంది...

2008 ఆరంగ్రేట సీజన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ 2లో ముగించడం ఇదే తొలిసారి... మే 24న టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో కలిసి క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడనుంది రాజస్థాన్ రాయల్స్. 

ఐపీఎల్‌లో గత 11 సీజన్లులగా కొనసాగుతూ వస్తున్న ఓ సెంటిమెంట్ ప్రకారం చూస్తే, 2022 ఫైనల్‌కి దూసుకెళ్లే మొట్టమొదటి జట్టు రాజస్థాన్ రాయల్స్ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

Image credit: PTI

2011 నుంచి 2021 వరకూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టే, మొదటి క్వాలిఫైయర్‌లో గెలిచి ఫైనల్‌కి దూసుకెళ్లడం విశేసం. 2011 సీజన్‌లో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే, టేబుల్ టాపర్ ఆర్‌సీబీని ఓడించి ఫైనల్ చేరింది... సీజన్‌లో టైటిల్ విన్నర్‌గానూ నిలిచింది.

2012 సీజన్‌లో లీగ్ స్టేజ్‌లో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్, టేబుల్ టాపర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ని ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. టైటిల్ విన్నర్‌గానూ నిలిచింది కేకేఆర్...

2013 సీజన్‌లో లీగ్ స్టేజ్‌ని టాప్ 2లో ముగించిన ముంబై ఇండియన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో గెలిచి ఫైనల్‌కి దూసుకెళ్లడమే కాకుండా మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకుంది...
 

2014 సీజన్‌లో టేబుల్ టాపర్ పంజాబ్‌ని క్వాలిఫైయర్ 1లో ఓడించిన కేకేఆర్, ఫైనల్ చేరి... రెండోసారి ఐపీఎల్ టైటిల్ కూడా సాధించింది...

2015, 2016, 17 సీజన్లలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. 2015లో ముంబై ఇండియన్స్, 2016లో ఆర్‌సీబీ, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫైనల్ చేరాయి... అయితే ముంబై టైటిల్ గెలిస్తే ఆర్‌సీబీ, పూణే టైటిల్ గెలవలేకపోయాయి...

Image credit: PTI

2018, 2019 సీజన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్, టాప్ 2లో ముగించి క్వాలిఫైయర్ 1లో గెలిచి ఫైనల్‌కి దూసుకెళ్లింది. 2018లో సన్‌రైజర్స్‌ని ఓడించి టైటిల్ గెలిచిన సీఎస్‌కే, 2019లో ముంబై చేతుల్లో ఓడింది...

2020 సీజన్‌లో టాప్ 2లో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్, క్వాలిఫైయర్ 1లో ఓడినా... క్వాలిఫైయర్ 2లో గెలిచి ఫైనల్ చేరింది. అయితే మరోసారి ముంబై చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...


2021 సీజన్‌లో టాప్ 2లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, మొదటి క్వాలిఫైయర్‌లో గెలిచి ఫైనల్ చేరి... టైటిల్ కూడా గెలిచింది...

ఈ సెంటిమెంట్ ప్రకారం ఈసారి రాజస్థాన్ రాయల్స్‌ ఫైనల్ చేరడం పక్కా అంటున్నారు ఐపీఎల్ విశ్లేషకులు. లక్ కూడా వర్కవుట్ అయితే ఈసారి రాయల్స్‌కి రెండో టైటిల్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు..

click me!