అండర్19 వరల్డ్ కప్‌లో తిరుగులేని రికార్డు! మరి ఆ తర్వాత ఏమవుతోంది... ఐసీసీ టోర్నీల్లో టీమిండియా...

First Published Jan 30, 2023, 10:55 AM IST

మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు. అంతకుముందు గత ఏడాది జరిగిన పురుషుల అండర్19 వరల్డ్ కప్ టైటిల్ విజేత కూడా టీమిండియానే...

Image credit: Getty

పురుషుల అండర్19 వరల్డ్ కప్ ట్రోఫీని ఇప్పటిదాకా 18 సార్లు నిర్వహిస్తే, 5 సార్లు టైటిల్ గెలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది భారత జట్టు... ఇప్పుడు మహిళల అండర్19 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కూడా టీమిండియా ఖాతాలోనే చేరింది...

2007లో మొట్టమొదటిసారి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఎంఎస్ ధోనీ, టీ20 వరల్డ్ కప్ గెలిస్తే... 2023లో మొట్టమొదటిసారి భారత జట్టుకి సారథ్యం వహించిన షెఫాలీ వర్మ, ఐసీసీ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది...

అయితే అండర్19 టోర్నీల్లో అదరగొడుతున్న భారత జట్టు, ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో ఎందుకని ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ని రెండు సార్లు గెలిచిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్‌ని ఓ సారి కైవసం చేసుకుంది...

దీనికి కారణం ఒకటే హైప్, క్రేజ్, అంచనాలు... అండర్19 టీమ్‌పై పెద్దగా అంచనాలు ఉండవు. టీమ్‌లో ప్లేయర్ల ఎంపిక విషయంలో జరిగే సిఫారసులు, రికమెండేషన్లు, రిజర్వేషన్ల, కోటాలు చాలా తక్కువ. అయితే ప్రధాన జట్టు విషయానికి వచ్చేసరికి ఇవన్నీ అడ్డంకులుగా మారతాయి..
 

Image credit: PTI

2008 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్‌గా ఓ వన్డే వరల్డ్ కప్, ఓ టీ20 వరల్డ్ కప్ ఆడాడు. అయితే అండర్19 వరల్డ్ కప్ గెలిచినట్టుగా, టీమిండియాకి కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ అందించలేకపోయాడు...

Image credit: Getty

అండర్19లో టీమ్‌లో ఉండే జోష్, అనుభవం లేకపోయినా ప్రెషర్‌ని ఫేస్ చేయగల పరిపక్వత... ఆ తర్వాత మాయమవుతోంది. అనుభవం వచ్చిన తర్వాత, ప్రెషర్‌ని ఫేస్ చేయడంలో ప్లేయర్లు చాలా ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణం కోట్ల మంది అంచనాలను మోయాల్సి రావడం...

అదీకాకుండా అండర్19 టీమ్‌లోకి వచ్చే సమయంలో ప్లేయర్లు, ఎన్నో కష్టాలను అనుభవించి, టీమ్‌లో ప్లేస్‌ని దక్కించుకోవడానికి అహర్నిషలు శ్రమించాల్సి ఉంటుంది. ఏదో సాధించాలనే తపన, తాపత్రయం, వారి నరనరాన ప్రవహిస్తూ ఉంటుంది...  భారత ప్రధాన టీమ్‌లోకి వచ్చిన తర్వాత ఐపీఎల్, కోట్ల కాంట్రాక్ట్‌లు, డబ్బు, ఆస్తులు... ఆ ఉత్సాహాన్ని, కష్టపడాలనే తపనను చంపేస్తున్నాయి...

Image credit: PTI

ఐపీఎల్‌‌లో గ్రూప్ మ్యాచ్‌ ఓడినప్పుడు తెగ ఫీలైపోయిన ప్లేయర్లు కూడా టీ20 వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిన సమయంలో నవ్వుతూ పెవిలియన్ చేరడం టీవీ కెమెరాల్లో కనిపించింది. అండర్19లో టీమిండియా సూపర్ సక్సెస్‌కి, ప్రధాన టీమ్‌ ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి ఈ డెడికేషన్ మిస్ కావడమే ప్రధాన కారణం.. 

click me!