ఇండియా - న్యూజిలాండ్ మూడో టీ20కి అండర్19 విన్నింగ్ టీమ్‌కి ఆహ్వానం... వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయిలకు...

First Published Jan 30, 2023, 9:33 AM IST

మొట్టమొదటి ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. భారీ అంచనాలతో టోర్నీని మొదలెట్టిన షెఫాలీ వర్మ టీమ్, ఎక్కడా తగ్గకుండా పర్ఫామెన్స్ ఇచ్చి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఉమెన్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత మహిళా జట్టు...

Image credit: Getty

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా, 17.1 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టును 68 పరుగులకి చాపచుట్టేసింది. అయితే అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, ఆ లక్ష్యాన్ని కాపాడుకుంటూ 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది..

Image credit: Getty

అందుకే భారత జట్టు 69 పరుగుల లక్ష్యాన్ని అందుకోగలదా? ఆస్ట్రేలియాలా తడబడుతుందా? అనే అనుమానం రేగింది. అదీకాకుండా టీ20ల్లో 200+ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం, 100లోపు టార్గెట్‌ని ఛేదించడం రెండూ ఒక్కటే. ఎందుకంటే టార్గెట్ ఎక్కువగా ఉందని మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడాలని చూసినా, చిన్న టార్గెట్ కదా! త్వరగా కొట్టేద్దాం అని తొందరపడినా రిజల్ట్ తేడా కొట్టేస్తది...
 

India U19 Women

అయితే భారత అండర్19 వుమెన్స్ టీమ్ ఇలా తొందరపడలేదు.  టోర్నీలో లీడ్ స్కోరర్‌గా ఉన్న శ్వేతా సెహ్రావత్ త్వరగా కోల్పోయినా పిచ్‌కి తగ్గట్టు ఆడుతూ 14 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి... ఛాంపియన్‌గా నిలిచింది...

U19 World Cup

మొట్టమొదటి అండర్19 మహిళా టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది బీసీసీఐ. అంతేకాదు ఫిబ్రవరి 1న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మెన్స్ టీమ్స్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్‌కి రావాల్సిందిగా అమ్మాయిల టీమ్‌ని ఆహ్వానించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కి హాజరయ్యే భారత అమ్మాయిల టీమ్‌కి అక్కడ ఘనంగా సత్కరించబోతున్నట్టు సమాచారం. 90 వేల మందికి పైగా ప్రేక్షకుల మధ్య షెఫాలీ వర్మ టీమ్‌, అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి..

click me!