మరోసారి అశ్విన్‌ను బాగా మిస్ అవుతున్న టీమిండియా... టీ బ్రేక్ విరామానికి ఇంగ్లాండ్‌కి...

First Published Sep 3, 2021, 8:35 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ లేని లోటు మరోసారి భారత జట్టు ప్రదర్శనలో స్పష్టంగా కనిపించింది. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, భారీ స్కోరు దిశగా సాగుతూ... ఇప్పటికే భారత జట్టుపై 36 పరుగుల ఆధిక్యం సాధించింది. టీ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది ఇంగ్లాండ్...

ఓవర్‌నైట్ స్కోరు 53/3 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్ జట్టు, ఓవర్టన్, డేవిడ్ మలాన్ వికెట్లు త్వరగా కోల్పోయింది. 

అయితే ఆరో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జానీ బెయిర్ స్టో, ఓల్లీ పోప్ ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. 77 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసిన బెయిర్ స్టోను అవుట్ చేసిన సిరాజ్, ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు... 

అయితే ఆ తర్వాత మొయిన్ ఆలీతో కలిసి ఏడో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఓల్లీ పోప్. 71 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసిన మొయిన్ ఆలీని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

అంతకుముందు జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో మొయిన్ ఆలీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినా, భారత జట్టులో ఎవ్వరూ సరిగ్గా అప్పీలు చేయకపోవడంతో అతను బతికిపోయాడు..

143 బంతుల్లో 6 ఫోర్లతో 74 పరుగులు చేసిన ఓల్లీ పోప్... భారత బౌలర్లను ఆటాడుకుంటూ పరుగులు సాధిస్తున్నాడు. ఓల్లీ పోప్‌కి గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం...

ఓల్లీ పోప్‌ను నాలుగు సార్లు అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగిన టీమిండియా మరోసారి భారీ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోంది...

ఇంగ్లాండ్ ఇప్పటికే 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓల్లీ పోప్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే క్రిస్ వోక్స్, రాబిన్‌సన్ కూడా బ్యాటింగ్ చేయగలరు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని టీమిండియా ఎంత తక్కువకి పరిమితం చేస్తే, అంత బెటర్...  

click me!