కెఎల్ రాహుల్ కెప్టెన్సీ బాగుంది. క్లీన్ స్వీప్ అయినా అతనే... టీమిండియా హెడ్‌ కోచ్ రాహుల్ ద్రావిడ్...

First Published Jan 24, 2022, 11:55 AM IST

సౌతాఫ్రికా టూర్‌లో లక్కీగా భారత జట్టును నడిపించే సువర్ణావకాశం దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్. బీసీసీఐతో విభేదాల కారణంగా విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీని కోల్పోవడం, రోహిత్ శర్మ గాయపడడంతో ఆ ప్లేస్‌లోకి కెఎల్ రాహుల్ వచ్చాడు...

తన బ్యాటింగ్‌తో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెఎల్ రాహుల్, కెప్టెన్‌గా మాత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గా ఫెయిలయ్యాడు...

కెఎల్ రాహుల్ పేలవమైన కెప్టెన్సీ కారణంగా భారత జట్టు, సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది...

కెప్టెన్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లో విజయాన్ని దక్కించుకోలేకపోయిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు సొంతం చేసుకున్నాడు కెఎల్ రాహుల్...

అయినప్పటికీ కెఎల్ రాహుల్‌ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. ‘కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ బాగానే జట్టును నడిపించాడు...

అతను ఇప్పుడిప్పుడే కెప్టెన్‌గా కెరీర్ మొదలుపెడుతున్నాడనే విషయం మనం గుర్తుంచుకోవాలి. నా వరకైతే అతను తనవంతుగా నూటికి నూరు శాతం ప్రయత్నం చేశాడు...

భవిష్యత్తులో కెఎల్ రాహుల్ మంచి కెప్టెన్ అవుతాడు... రాహుల్‌లో ఆ టాలెంట్ అయితే పుష్కలంగా ఉంది... భారత జట్టుకి ఈ సిరీస్ కళ్లు తెరిపిస్తుందని అనుకుంటున్నా...

మేం చాలా రోజులుగా వన్డే క్రికెట్‌ ఆడడం లేదు. మార్చిలో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన తర్వాత మళ్లీ ఇప్పుడే. లంకలో వన్డే సిరీస్ ఆడినా, అప్పటి జట్టు, ఆ ప్లేయర్లు పూర్తిగా వేరు...

వన్డే వరల్డ్‌కప్ సమీపిస్తున్న సమయంలో ఎక్కువ వన్డేలు ఆడాల్సిన అవసరం చాలా ఉంది... ముఖ్యంగా 6,7,8 స్థానాల్లో ఆడే ప్లేయర్లు ఇప్పుడు అందుబాటులో లేరు...

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు, వన్డే సిరీస్ ఆడి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది..’ అంటూ కామెంట్ చేశాడు రాహుల్ ద్రావిడ్...

అయితే రాహుల్ ద్రావిడ్ కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. 2006లో సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో ఒక్క విజయం లేకుండా ముగించాడు అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్...

ఆ తర్వాత సౌతాఫ్రికాలో ఇలాంటి ఓటమిని రుచి చూపించింది కెఎల్ రాహులే... అప్పుడు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ జట్టును నడిపిస్తే, ఇప్పుడు హెడ్ కోచ్‌గా ఉండడం మరో విశేషం...

click me!