టీమిండియా అసలు సమస్య ఇదే! టెండూల్కర్‌‌ని ఫాలో అయితే బెటర్... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

First Published Sep 13, 2022, 1:58 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలోనూ గ్రూప్ స్టేజీకే పరిమితమైంది భారత జట్టు. కెప్టెన్‌ని మార్చినా, హెడ్ కోచ్‌ను మార్చినా టీమ్ రిజల్ట్ మాత్రం మారలేదు. అసలు టీమిండియా సమస్య కెప్టెన్సీ కాదని, ఈ ఓటములకు అసలు కారణం వేరే ఉందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

గాయం కారణంగా రవీంద్ర జడేజా ఆసియా కప్ 2022 మధ్యలో దూరం కాగా జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్... టోర్నీలో ఆడనేలేదు. కెఎల్ రాహుల్, దీపక్ చాహార్ గాయం నుంచి కోలుకున్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆసియా కప్‌లో ఆడారు..

‘టీమిండియా అసలు సమస్య గాయాలే... క్రీజులో గాయపడి ఆటగాళ్లు దూరమైతే అది వేరే విషయం. అయితే భారత ప్లేయర్లలో చాలామంది గ్రౌండ్‌లో గాయపడడం లేదు. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించడం లేదు...

హార్ధిక్ పాండ్యా చాలా ఏళ్ల క్రితం బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా రెండేళ్లు బౌలింగ్‌కి దూరంగా ఉన్నాయి. అయితే మిగిలిన వాళ్లలో చాలామంది జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ, బయటి కార్యకలాపాల్లో విన్యాసాలు చేస్తూ గాయపడుతున్నారు...

జడేజా క్రీజులో గాయపడలేదు. అతనికి గాయం ఎలా అయ్యిందో నాకైతే అర్థం కావడం లేదు. ఆటగాళ్లకు స్కిల్స్ చాలా ముఖ్యం. స్కిల్స్ లేకుండా ఏ ప్లేయర్ కూడా టీమిండియాకి ఆడేంత దూరం రాడు...

Sehwag-Ganguly

స్కిల్స్ కంటే జిమ్ చేయడం పెద్ద ముఖ్యం ఏమీ కాదు. క్రికెట్‌కి ఒక నెల, రెండు నెలల బ్రేక్ వస్తే అప్పుడు ఫిట్‌నెస్ సాధించడం చాలా అవసరం. సచిన్ టెండూల్కర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా...

ఆయన టీమ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా 6-8 కేజీల బరువు ఎత్తింది లేదు. ఎందుకని ఎక్కువ బరువులు ఎత్తడం లేదని ఓ సారి సచిన్‌ని అడిగా... ‘‘ఆటకు అందుబాటులో ఉండాలంటే శరీరంపై అధిక ఒత్తిడ పడకూడదు. అందుకే నేను ఇలా మెయింటైన్ చేస్తున్నా.. నా రిథమ్ మిస్ కాకుండా ఉంటే చాలు... ’’ అని టెండూల్కర్ సమాధానం చెప్పారు.. ఇప్పుడు ప్లేయర్ల తీరు మారింది...

విరాట్ కోహ్లీ, మిగిలిన క్రికెటర్లు 50-6-70 కేజీల బరువులు ఎత్తుతుంటారు. ఇలా అధిక బరువులు ఎత్తడం వల్ల ఆటగాళ్లకు గాయాలు అయ్యే అవకాశాలు పెరుగుతాయి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

click me!