భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్, టీ20 వరల్డ్ కప్ 2022 అందిస్తాడని, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 కూడా మనదేనని కలలు కన్నారు టీమిండియా ఫ్యాన్స్. అయితే ఆసియా కప్ 2022 రిజల్ట్, రోహిత్ ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది...
ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించింది టీమిండియా. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో పెద్దగా మార్పులు కనిపించలేదు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను జట్టులోకి తీసుకుని గాయపడిన రవీంద్ర జడేజా, అనారోగ్యానికి గురైన ఆవేశ్ ఖాన్‌లను తప్పించింది భారత జట్టు..
26
ఈ రెండూ తప్పిస్తే దాదాపు ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఆస్ట్రేలియా పంపించనుంది బీసీసీఐ. దీంతో ఆస్ట్రేలియాలో కూడా భంగపాటు తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
36
rohit sharma
అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం ఓ సెంటిమెంట్‌ని చూపించి, ఈసారి టీ20 వరల్డ్ కప్ 2022 మనదేనని అంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఆడిన ప్రతీ సిరీస్‌లోనూ టైటిల్ గెలిచాడు. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్, అదే సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలిచాడు...
46
Image credit: Getty
2013లోనే ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా ఆడిన మొదటి వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ విజయాలు అందుకున్నాడు. అంతేకాదు రోహిత్ కెప్టెన్సీలో ఆడిన మొదటి టెస్టు సిరీస్, ట్రై సిరీస్‌లను కూడా సొంతం చేసుకుంది భారత జట్టు...
56
Rohit Sharma
విరాట్ కోహ్లీ పెళ్లి తర్వాత విశ్రాంతి తీసుకోవడంతో ఆసియా కప్ 2018 టోర్నీలో భారత జట్టును నడిపించాడు రోహిత్ శర్మ. ఈ టోర్నీలో భారత జట్టు, ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది...
66
ఇలా కెప్టెన్‌గా అడుగుపెట్టిన ప్రతీ సిరీస్‌లోనూ, టోర్నీలోనూ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు 2022 ఎడిషన్ కెప్టెన్‌గా మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్. ఇప్పటిదాకా జరిగిన ప్రతీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడిన ప్లేయర్‌గా రికర్డు క్రియేట్ చేయబోతున్న రోహిత్ శర్మ... భారత జట్టుకి రెండో పొట్టి ప్రపంచకప్‌ని అందిస్తాడో లేదో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి...