డేవిడ్ వార్నర్‌కి ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్సీ... ఆరోన్ ఫించ్ స్పెషల్ రికమెండేషన్‌...

First Published Sep 13, 2022, 12:13 PM IST

ఆరోన్ ఫించ్, అర్ధాంతరంగా వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా తర్వాతి వన్డే కెప్టెన్‌ ఎవరు? అనే విషయంపై ఉత్కంఠ సాగుతోంది. ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాకి వన్డే సిరీస్‌లు ఏమీ లేవు. టీ20 సిరీస్‌లు ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది ఆస్ట్రేలియా...

Aaron Finch

డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఆరంభించబోతోంది ఆస్ట్రేలియా. ఈ పొట్టి ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆరోన్ ఫించ్, టీ20లకు కూడా రిటైర్మెంట్ ఇస్తాడని టాక్ వినబడుతోంది...

కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేని ఆరోన్ ఫించ్... పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఒకేసారి తప్పుకోవాలని భావించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇప్పుడు టీ20ల నుంచి తప్పుకుంటే ఆసీస్‌ను ఇబ్బందుల్లో పడేసినట్టు అవుతుంది...

aaron finch

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కేవలం వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఆరోన్ ఫించ్. తన తర్వాత ఆసీస్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ అయితే బాగుంటుందని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఫించ్...
 

2018లో బాల్ టాంపిరింగ్ వివాదంలో చిక్కుకుని, ఆసీస్ జట్టుకి కెప్టెన్సీ చేయకుండా జీవితకాలం బ్యాన్ పడిన డేవిడ్ వార్నర్‌కి వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ఆరోన్ ఫించ్... ఇదే వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి రెండేళ్ల పాటు కెప్టెన్సీ చేయకుండా బ్యాన్ వేసింది ఆస్ట్రేలియా...

ఈ బ్యాన్ నుంచి బయటికి వచ్చిన స్టీవ్ స్మిత్, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి టెస్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే యాషెస్ సిరీస్ 2021-22 టోర్నీలో ప్యాట్ కమ్మిన్స్ గాయపడడంతో ఓ మ్యాచ్‌కి కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

‘క్రికెట్ ఆస్ట్రేలియా, డేవిడ్ వార్నర్‌పై వేసిన జీవితకాల నిషేధం విషయాన్ని మరోసారి పరిశీలించాలి. నేను చాలాసార్లు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఆడాను. అతను అద్భుతమైన కెప్టెన్. వార్నర్ తీసుకునే నిర్ణయాలు, ఎంతో వ్యూహాత్మకంగా ఉంటాయి...

డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఆడడానికి ప్లేయర్లు అందరూ ఇష్టపడతారు. అతను మోస్ట్ లవబుల్ పర్సన్. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఏమనుకుంటుందో నాకు మాత్రం 100 శాతం తెలీదు... 

David Warner-Aaron Finch

ప్యాట్ కమ్మిన్స్‌కి కరోనా సోకినప్పుడు ఆడిలైడ్ టెస్టులో స్టీవ్ స్మిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాబట్టి డేవిడ్ వార్నర్‌పై విధించిన నిషేధాన్ని తొలగించడంలో తప్పు లేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు ఆరోన్ ఫించ్...

click me!