జస్ప్రిత్ బుమ్రా మెరుపులు ఒక్క టెస్టుకేనా... ఇషాంత్ శర్మ గాయం గురించి తెలిసీ...

First Published Aug 14, 2021, 7:56 PM IST

నాటింగ్‌హమ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... 9 వికెట్లతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు...

బుమ్రా ఫామ్‌లోకి వచ్చాడంటే టీమిండియాకి మంచి రోజులు వచ్చినట్టే అనుకున్నారంతా. అయితే టీమిండియా అభిమానుల సంతోషమంతా ఒక్క మ్యాచ్‌తోనే ముగిసినట్టే కనిపిస్తోంది...

లార్డ్స్‌ మైదానంలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో అదరగొట్టిన చోట... జస్ప్రిత్ బుమ్రా ఒక్క వికెట్ తీయడానికి కస్టపడుతున్నాడు...

Bumrah

తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన 20 ఓవర్లలో 6 మెయిడిన్లు ఉన్నా, ఒక్క వికెట్ కూడా దక్కలేదు... ఇందులో ఏకంగా ఏడు నో బాల్స్ వేయడం బుమ్రా ఫ్యాన్స్‌ని కలవరబెడుతున్న మరో విశేషం...

మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసి ఆకట్టుకుంటే... సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తన మొదటి 18 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు... అదీకాకుండా 3+ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు...

మహ్మద్ షమీ ఓ వికెట్ తీసినా... 4 ఎకానమీతో పరుగులు సమర్పించాడు... షమీ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ బౌలర్లు ఎలాంటి ఇబ్బంది పడడం లేదు...

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియంసన్ ఆడిన ఓ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నించిన ఇషాంత్ శర్మ, తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా తొలి టెస్టులో ఇషాంత్‌కి చోటు దక్కలేదు...

ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకున్నా... అతనికి మరింత విశ్రాంతి అవసరమని బౌలింగ్ యాక్షన్‌ని బట్టి తెలుస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఉమేశ్ యాదవ్‌కి అయినా చోటు ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు అభిమానులు...

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన విమర్శల కారణంగా తొలి టెస్టులో ఆ కసిని మొత్తం తీర్చుకున్నట్టు కనిపించిన బుమ్రా... ఆ పర్ఫామెన్స్‌తో వచ్చిన ప్రశంసలతో చల్లాడిపోయాడని ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

click me!