విరాట్ కోహ్లీ రనౌట్, ఆ వెంటనే రహానే, విహారి... ఎనిమిదేళ్ల తర్వాత కోహ్లీని అలా అవుట్ చేసిన రహానే...

First Published Dec 17, 2020, 4:48 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి, రనౌట్ అయ్యాడు... 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... అజింక రహానే ఇచ్చిన రాంగ్ కాల్ కారణంగా అనవసర పరుగుకి ప్రయత్నించి... పెవిలియన్ చేరాడు. 188 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా... ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరాయి...

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
undefined
52 ఇన్నింగ్స్‌ల్లో 2573+పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... 63 ఇన్నింగ్స్‌ల్లో 2549 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు...
undefined
విరాట్ కోహ్లీ, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయిన చివరి బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. 2013లో సచిన్ తన చివరి టెస్టులో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
undefined
2012లో ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొట్టమొదటిసారి టెస్టుల్లో రనౌట్ అయిన విరాట్ కోహ్లీ, మళ్లీ 8 ఏళ్ల తర్వాత అదే మైదానంలో టెస్టుల్లో రెండోసారి రనౌట్ కావడం విశేషం..
undefined
ఆడిలైడ్ ఓవల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆడిలైడ్‌లో కోహ్లీ 505 పరుగులు చేయగా, రాహుల్ ద్రావిడ్ 401 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
undefined
2019 వరకూ ఒక్కసారి కూడా నాన్‌-స్ట్రైయికింగ్ బ్యాట్స్‌మెన్‌ని రనౌట్ చేయని అజింకా రహానే... 2020లో మూడు టెస్టుల్లో రెండు సార్లు సహచర బ్యాట్స్‌మెన్ రనౌట్‌లో భాగమయ్యాడు. ఇంతకుముందు రహానే కారణంగా పంత్ రనౌట్ అయితే, నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రనౌట్ అయ్యాడు...
undefined
టెస్టుల్లో 50+ హాఫ్ సెంచరీలు చేసిన ఎనిమిదో భారత క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ...
undefined
అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50+ హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ... సచిన్ 127, రాహుల్ ద్రావిడ్ 136 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా విరాట్ 146 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు.
undefined
పింక్ బాల్ టెస్టుల్లో మొట్టమొదటి సెంచరీ బాదిన క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ... విదేశాల్లో ఆడిన పింక్ బాల్ టెస్టుల్లో మొదటి హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు సృష్టించాడు...
undefined
విరాట్ కోహ్లీ అవుటైన కొద్దిసేపటికే అజింకా రహానే వికెట్ కూడా కోల్పోయింది టీమిండియా. 92 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన రహానే స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
25 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన హనుమ విహారి కూడా హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 206 పరుగుల వద్ల ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా.
undefined
click me!