రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్... మెంటల్ టార్చర్ అనుభవించానంటూ...

First Published Dec 17, 2020, 4:11 PM IST

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 29 ఏళ్ల అమీర్... ఇప్పటిదాకా 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచులు ఆడాడు. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ తరుపున ఆడిన బౌలర్లలో మంచి టాలెంటెడ్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్... మొత్తంగా 259 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.

29 ఏళ్లకే క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్... మెంటల్ టార్చర్ అనుభవించానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
undefined
‘నేను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా. నేను మానసికంగా చాలా టార్చర్ చేయబడ్డాను. ఇంత టార్చర్‌ను భరించగల శక్తి నాకు ఇక లేదు...
undefined
2010 నుంచి 2015 దాకా చాలా టార్చర్ భరించా... ఇప్పుడు మళ్లీ నా వల్ల కాదు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అమీర్.
undefined
టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని పాక్ క్రికెట్ బోర్డు తప్పుగా అర్థం చేసుకుందని, టీ20 లీగ్‌లు ఆడేందుకు ఇలా చేస్తున్నానంటూ చులకనగా మాట్లాడిందని చెప్పాడు మహ్మద్ అమీర్.
undefined
‘నేను టెస్టు క్రికెట్ కోసం చేయాల్సినంత చేశాను... 36 టెస్టుల్లో 119 వికెట్లు తీశాను... కానీ టెస్టుల నుంచి తప్పుకోవాలన్న నా నిర్ణయానికి గౌరవం దక్కలేదు.
undefined
పాక్ క్రికెట్ బోర్డును మోసం చేశానంటూ మా బౌలింగ్ కోచ్ చెప్పాడు. ఇంకొకరేమో పని ఒత్తిడిని సరిగా హ్యాండెల్ చేయలేకపోతున్నానంటూ కామెంట్ చేశారు...’ అంటూ చెప్పుకొచ్చాడు అమీర్...
undefined
మహ్మద్ అమీర్ తీసుకున్న నిర్ణయం అతని వ్యక్తిగత నిర్ణయమని చెప్పిన పీసీబీ... ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని అమీర్ రిటైర్మెంట్‌ను అంగీకరిస్తున్నట్టు తెలిపింది.
undefined
అయితే యూకేలో క్లబ్ క్రికెట్ ఆడేందుకే మహ్మద్ అమీర్... పాక్ జట్టుకి రిటైర్మెంట్ ప్రకటించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
undefined
click me!