INDvsENG 2nd Test: పూజారా, రహానే, జడేజా వికెట్లు కోల్పోయిన టీమిండియా... ధోనీ తర్వాత ఏడేళ్లకి...

First Published Aug 15, 2021, 10:24 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కలిసి నాలుగో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాను ఆదుకున్నారు... 

206 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాను మార్క్ వుడ్ అవుట్ చేశాడు... దాదాపు 50 ఓవర్ల పాటు కొనసాగిన నాలుగో వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ వేశాడు మార్క్ వుడ్..

146 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేసిన అజింకా రహానే... మొయిన్ ఆలీ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టెస్టుల్లో మొయిన్ ఆలీ బౌలింగ్‌లో రహానే అవుట్ అవ్వడం ఇది 8వ సారి...

రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా మొయిన్ ఆలీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 5 బంతులాడి 3 పరుగులు చేసిన జడేజా... మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ఆగస్టు 15న టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అజింకా రహానే. 2014లో ఇంగ్లాండ్‌పై ఎమ్మెస్ ధోనీ ఈ ఫీట్ సాధించగా... ఏడేళ్ల తర్వాత రహానే భారత స్వాతంత్య్ర దినోత్సవాన అర్ధశతకం నమోదుచేశాడు...

టెస్టు ఇన్నింగ్స్‌లో 200లకు పైగా బంతులను ఎదుర్కోవడం, ఛతేశ్వర్ పూజారాకి ఇది 23వ సారి. భారత జట్టు తరుపున రాహుల్ ద్రావిడ్ (48), సచిన్ టెండూల్కర్ (41), సునీల్ గవాస్కర్ (26 సార్లు) మాత్రమే పూజారా కంటే ముందున్నారు...

ajinkya rahane
ajinkya rahane
click me!