రవిచంద్రన్ అశ్విన్‌ని కూడా హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లా మారుస్తారా... అభిమానుల్లో ఆందోళన...

Published : Aug 15, 2021, 08:12 PM IST

వన్డే, టీ20 ఫార్మాట్‌కి దూరమైనా ఇంగ్లాండ్ టూర్‌కి ముందు భారత టెస్టు టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు... దీంతో రవి అశ్విన్ అభిమానుల్లో కొత్త భయం మొదలైంది...

PREV
111
రవిచంద్రన్ అశ్విన్‌ని కూడా హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లా మారుస్తారా... అభిమానుల్లో ఆందోళన...

టీమిండియా తరుపున 79 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 413 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన అశ్విన్, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బంతితో పాటు బ్యాటుతో కూడా ఆకట్టుకున్నాడు...

211

అత్యధిక వేగంగా 250, 350 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌కి, విదేశీ పిచ్‌లపైన కూడా మంచి రికార్డు ఉంది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండేసి వికెట్లు తీసి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు అశ్విన్...

311

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి సిద్ధంగా ఉండేందుకు కౌంటీ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు...

411

దీంతో రవిచంద్రన్ అశ్విన్‌ని కూడా మరో హర్భజన్ సింగ్, కుల్దీప్ యాదవ్‌ల మాదిరిగా మారుస్తారేమో అని భయాందోళనలకు గురవుతున్నారు అభిమానులు... 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, 2015లో చివరి టెస్టు ఆడాడు...

511

వికెట్లు తీస్తూ టీమ్‌కి అవసరమైన ప్రదర్శన ఇస్తున్నప్పటికీ, రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా ఎంట్రీతో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు హర్భజన్ సింగ్. ఆరేళ్లుగా తుది జట్టులో చోటు కోసం వెయిట్ చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు...

611

చైనామెన్ కుల్దీప్ యాదవ్‌ది కూడా ఇలాంటి కథే... ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తర్వాత ఏడాదిన్నర పాటు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు కుల్దీప్ యాదవ్... టీమిండియా ఆడే ప్రతీ సిరీస్‌కి కుల్దీప్‌ యాదవ్‌ని ఎంపిక చేశారు...

711

న్యూజిలాండ్ టూర్‌తో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కి ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం దక్కలేదు. సీనియర్ స్పిన్నర్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బ్యాటుతోనూ, బాల్‌తోనూ రాణిస్తుండడంతో కుల్దీప్ యాదవ్, రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది...

811

అయితే తుది జట్టులో మాత్రం అతనికి అవకాశం దక్కేది కాదు. ఇలా రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కేది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చాలా గ్యాప్ రావడం, తుదిజట్టులోకి వచ్చినా కుల్దీప్ యాదవ్‌కి పెద్దగా ఓవర్లు వేసే అవకాశం రాకపోవడంతో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు...

911

ఈ కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన కుల్దీప్ యాదవ్... ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఏ మాత్రం మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఓ రకంగా జట్టుతో తిప్పుతూ దేశవాళీ క్రికెట్ ఆడనివ్వకుండా, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే అవకాశం ఇవ్వకుండా కుల్దీప్ యాదవ్ కెరీర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది టీమిండియానే...

1011

ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ విషయంలో కూడా అదే జరుగుతుందా? అనే అనుమానాలు రేగుతున్నాయి. వరుసగా రెండు, మూడు టెస్టుల్లో అశ్విన్‌ని పక్కనబెట్టి... ఆ తర్వాత ఓ మ్యాచ్‌లో అతనికి ఛాన్స్ ఇస్తే... పర్ఫామెన్స్ ఇవ్వాలనే ప్రెజర్ తీవ్రంగా పడుతుంది. ఇది పర్ఫామెన్స్‌ను దెబ్బతీస్తుంది...

1111

రాకరాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతే అశ్విన్‌ను పక్కనబెట్టడానికి విరాట్ కోహ్లీ అండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌కి కావాల్సిన సాకు దొరికినట్టు అవుతుంది... నాలుగేళ్లుగా వన్డే, టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోతున్న అశ్విన్... టెస్టులకు దూరమవుతాడేమోనని ఆందోళన చెందుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!

Recommended Stories