లక్కీగా వరల్డ్ కప్ గెలిచారు! 1983 భారత టీమ్‌లో తోపు ప్లేయర్లు ఎవ్వరూ లేరు... విండీస్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్..

Published : Jul 06, 2023, 10:53 AM IST

భారత క్రికెట్ గతిని మార్చిన విజయం 1983 వన్డే వరల్డ్ కప్. అప్పటికే రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన వెస్టిండీస్ టీమ్‌ని మొదటి మ్యాచ్‌లోనే ఓడించి, అందరికీ షాక్ ఇచ్చిన టీమిండియా, ఫైనల్‌ మ్యాచ్‌లోనూ సేమ్ రిజిల్ట్ రిపీట్ చేసి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయం లక్కీగా వచ్చేదేనంటున్నాడు వెస్టిండీస్ లెంజెండీ ఆండీ రాబర్ట్స్..

PREV
19
లక్కీగా వరల్డ్ కప్ గెలిచారు! 1983 భారత టీమ్‌లో తోపు ప్లేయర్లు ఎవ్వరూ లేరు... విండీస్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్..

24 ఏళ్ల కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983 వన్డే వరల్డ్ కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగిన భారత జట్టు, సంచలన విజయాలతో ఫైనల్ దాకా దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌లో టీమిండియా గెలుస్తుందని ఎవ్వరికీ నమ్మకాలు లేవు..

29

టీమిండియా ఫైనల్ దాకా రావడమే చాలా పెద్ద విచిత్రం అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టూ టైం వరల్డ్ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ని ఫైనల్‌లో చిత్తుగా ఓడించి, మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సాధించింది టీమిండియా..

39

అప్పటిదాకా క్రికెట్‌ని పట్టించుకోని ప్రభుత్వం, ప్రజలు... టీమిండియా విజయంతో ఒక్కసారిగా ఈ ఆటవైపు మళ్లారు. 1983 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమ్‌కి టికెట్లు కూడా కొనలేని స్థితిలో ఉన్న భారత క్రికెట్ బోర్డు,  ప్రపంచ కప్ విజయం తర్వాత కొన్నేళ్లలోనే వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించింది.. 

 

49

అయితే ఈ విజయం కేవలం అదృష్టం వల్లే వచ్చిందంటున్నాడు వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్.. ‘అవును, మేం ఇండియా చేతుల్లో ఓడిపోయాం. విండీస్ టీమ్ పతనానికి కారణమైన ఓటముల్లో ఇది కూడా ఒకటి...

 

59

క్రికెట్‌లో కొన్ని సార్లు విజయాలు వస్తాయి, మరికొన్ని సార్లు పరాజయాలు. మేం ఎప్పుడూ ఓటమిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవాళ్లం. ఎలాగైనా గెలవాలనే మ్యాచ్ ఆడతాం. కానీ మా కంటే తోపు టీమ్‌ని ఇప్పటిదాకా చూడలేదు..

 

69

క్రికెట్‌ మ్యాచ్ సాగే ఆ ఒక్క రోజు ఎవరి టైం బాగుంటే వాళ్లు గెలుస్తారు. ఫైనల్‌లో భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేశాం. 1983 వరకూ మేం ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు..

 

79

1983లో రెండు సార్లు ఇండయా చేతుల్లో ఓడిపోయాం. 1975 నుంచి 1983 వరకూ మాకు వచ్చిన రెండు పరాజయాలు అవే. ఆ రెండు మ్యాచుల్లోనూ మేం బాగా ఆడలేకపోయాం. ఇండియాకి అదృష్టం బాగా కలిసి వచ్చింది.. మా టీమ్‌లో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నారు. ఇండియాలో తోపు ప్లేయర్లు ఎవ్వరూ లేరు...

89
1983 World Cup

ఎందుకంటే 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియాతో జరిగిన సిరీస్‌లో 6-0 తేడాతో గెలిచాం. ఆ మ్యాచ్‌లో వీవ్‌ రిచర్డ్స్ అవుటైన తర్వాత మేం రికవరీ కాలేకపోయాం. అంతకుముందు రెండు వరల్డ్ కప్స్‌లో మేం తొలుత బ్యాటింగ్ చేశాం, 1983లో రెండోసారి బ్యాటింగ్ చేశాం. అదీ కూడా మా ఓటమికి కారణం...

99

భారత బ్యాటింగ్‌లో ఎవ్వరి బ్యాటింగ్‌ నాకు పెద్దగా నచ్చలేదు. ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. బౌలింగ్‌లోనూ ఒక్కరు కూడా 4 వికెట్లు కానీ, 5 వికెట్లు కానీ తీయలేదు. టాప్ క్వాలిటీ ఇన్నింగ్స్‌లు లేవు. ఏదో లక్‌ కలిసి వస్తే మా బ్యాడ్ లక్‌తో వాళ్లు గెలిచారంతే...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆండీ రాబర్ట్స్.. 

click me!

Recommended Stories