వెస్టిండీస్ టూర్‌లో జరిగే ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌కి జట్టుని ప్రకటించింది బీసీసీఐ. ఇందులో యశస్వి జైస్వాల్‌తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన రింకూ సింగ్‌కి మాత్రం షాక్ ఇచ్చారు సెలక్టర్లు...
ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది అద్వితీయ ప్రదర్శన ఇచ్చాడు రింకూ సింగ్. 14 మ్యాచుల్లో 59.25 సగటుతో 149.53 స్ట్రైయిక్ రేటుతో 474 పరుగులు చేసిన రింకూ సింగ్, కేకేఆర్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు..
28
ఈ సీజన్‌లో 4 హాఫ్ సెంచరీలు చేసిన రింకూ సింగ్, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 9లో నిలిచాడు. రింకూ సింగ్ కంటే ఎక్కువ పరుగులు చేసిన వారంతా టాపార్డర్ బ్యాటర్లే. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రింకూ సింగ్..
38
Image credit: PTI
ఈ ప్రదర్శనతో రింకూ సింగ్‌కి కచ్ఛితంగా వెస్టిండీస్ సిరీస్‌లో అవకాశం దక్కుతుందని భావించారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు... అయితే సెలక్టర్లు మాత్రం రింకూ సింగ్‌కి షాక్ ఇచ్చారు...
48
Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్ (సగటు 59.33) తర్వాత అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్ కూడా రింకూ సింగే. ఐపీఎల్‌లోనే కాకుండా దేశవాళీ టోర్నీల్లో కూడా నిలకడైన ప్రదర్శన చూపించి.. అదరగొట్టాడు రింకూ సింగ్. అయినా అతన్ని పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అనేది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు..
58
Image credit: PTI
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు రింకూ సింగ్. ‘కొందరికీ సోఫా కేవలం ఓ ఫర్నీచర్ మాత్రమే. మరికొందరికి అది సెలక్షన్‌కి తలుపు’ అంటూ విలియం షేక్స్‌స్పియర్ కొటేషన్‌ని ఇన్‌స్టా స్టేటస్‌గా పోస్ట్ చేశాడు రింకూ సింగ్...
68
రంజీల్లో రికార్డులు సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ని టెస్టులకు సెలక్ట్ చేయకపోవడానికి అతని యాటిట్యూడ్, ఫిట్‌నెస్, ఐపీఎల్ పర్ఫామెన్స్‌లను కారణంగా చెప్పుకొచ్చింది బీసీసీఐ. మరి రింకూ సింగ్ ఫిట్‌గా ఉన్నాడు, అతనికి ఐపీఎల్‌లోనూ రికార్డులు ఉన్నాయి...
78
అన్నింటికీ మించి రింకూ సింగ్ యాటిట్యూడ్ చాలా బాగుంది. అయినా అతనికి టీమ్‌లో చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇషాన్ కిషన్, టీ20ల్లో నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఆవేశ్ ఖాన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు..
88
Mukesh Kumar
ముకేశ్ కుమార్, ఐపీఎల్‌లో కానీ దేశవాళీ టీ20 టోర్నీల్లో కానీ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. అయినా ఇషాన్ కిషన్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లకు జట్టులో చోటు కల్పించిన సెలక్టర్లు, రింకూ సింగ్‌లాంటి మ్యాచ్ విన్నర్‌ని పక్కనబెట్టడం విశేషం...