ఐపీఎల్‌లో బాగా ఆడాడని అజింకా రహానేని వరల్డ్ కప్ ఆడించకండి.. సెలక్టర్లకు ఆకాశ్ చోప్రా సూచన..

Published : Jul 04, 2023, 05:46 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి, టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అజింకా రహానే. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా భారత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి, వైస్ కెప్టెన్సీ కూడా కొట్టేశాడు..  

PREV
16
ఐపీఎల్‌లో బాగా ఆడాడని అజింకా రహానేని వరల్డ్ కప్ ఆడించకండి.. సెలక్టర్లకు ఆకాశ్ చోప్రా సూచన..
Rahane

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన అజింకా రహానే, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరుపున 100+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ రహానే ఒక్కడే...
 

26

దీంతో అజింకా రహానేని వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా ఉండేవాడు. పేలవ ఫామ్‌తో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రహానే, టీమ్‌కి దూరమై 17 నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తూనే... మళ్లీ తన పొజిషన్‌ని తిరిగి దక్కించుకున్నాడు..
 

36

‘అజింకా రహానే, ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగా ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో ఎంత మంచి పర్ఫామెన్స్ ఇచ్చినా, రహానేని తిరిగి టెస్టు టీమ్‌కి సెలక్ట్ చేయడానికి అతని ఐపీఎల్ పర్ఫామెన్సే కారణం. ఇది అందరికీ తెలుసు..

46
Ajinkya Rahane

అయితే ఐపీఎల్‌లో 200+ స్ట్రైయిక్ రేటుతో ఆడాడు కదా అని అజింకా రహానేని భారత వన్డే టీమ్‌లోకి, టీ20 టీమ్‌లోకి సెలక్ట్ చేయకూడదు. అజింకా రహానే మీద ద్వేషంతోనో లేక అతనంటే ఇష్టం లేకనే ఇలా చెప్పడం లేదు..

56
Ajinkya Rahane

18 నెలలు టీమ్‌కి దూరంగా ఉండి, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క మ్యాచ్‌కే అజింకా రహానేకి తిరిగి టెస్టు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇలా చేయడాన్ని సౌరవ్ గంగూలీ కూడా ప్రశ్నించాడు. కాబట్టి ఇప్పుడు రహానే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తే యంగ్ ప్లేయర్లకు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చినట్టు అవుతుంది..

66
Ajinkya Rahane

అజింకా రహానే చాలా ఏళ్లుగా వన్డే, టీ20లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్‌లో అతని అవసరం లేదు. చాలామంది అతని ఐపీఎల్ పర్ఫామెన్స్ చూసి, వన్డే వరల్డ్ కప్‌ 2023లో ఆడించాలని అంటున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్‌లో ఆడించడానికి చాలా మంది ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

click me!

Recommended Stories