నీ తొక్కలో బుక్ కోసం, టెస్టు సిరీస్‌నే బుక్ చేశావుగా శాస్త్రీ... టీమిండియా హెడ్‌కోచ్‌పై మరోసారి ట్రోలింగ్...

First Published Sep 10, 2021, 1:55 PM IST

ఎన్నడూలేనట్టుగా ఈసారి ఇంగ్లాండ్ టూర్‌‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం చూపించింది. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మినహాయిస్తే, మిగిలిన సిరీస్ మొత్తం ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అయితే సిరీస్‌పై ఫలితం తేలని పరిస్థితి... కారణం హెడ్‌కోచ్ రవిశాస్త్రి...

టీమిండియాలో కరోనా కేసులు వెలుగుచూడడంతో మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టును అర్ధాంతరంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు....

టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నా, సిరీస్ ఫలితంపై ఇంకా స్పష్టత రాని పరిస్థితి. ఇంగ్లాండ్ మాత్రం భారత జట్టు మ్యాచ్ ఆడలేమని చేతులేత్తేసిందని... సిరీస్ డ్రాగా ముగిసిందని ప్రకటించి, ఆ తర్వాత అదేం లేదంటూ సరిదిద్దుకుంది..

దీనంతటికీ కారణం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి. క్రమశిక్షణతో మెలుగుతూ ప్లేయర్లకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్‌కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ తలతిక్క పని వల్లే, ఇప్పుడు టెస్టు సిరీస్ ఫలితం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి...

నాలుగో టెస్టు మూడో రోజు సాయంత్రం లండన్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటెల్‌లో ఏర్పాటు చేసిన పార్టీకి కోచ్ రవిశాస్త్రితో పాటు టీమిండియా సభ్యులందరూ హాజరయ్యారు...

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి, బీసీసీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయో బబుల్ నుంచి బయటికి వెళ్లిన ఈ కార్యక్రమం వల్లే టీమిండియా సభ్యులకి వైరస్ సోకిందని తేల్చారు అధికారులు...

ఇలా చెప్పాపెట్టకుండా బయటికి ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలను ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ...

నాలుగో టెస్టు సమయంలో భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడగా... తాజాగా భారత బృందంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది... ఐదో రోజు ఆరంభానికి ముందు టీమిండియా అసిస్టెంట్ ఫిజియోకి కరోనా పాజిటివ్ వచ్చింది. 

దీంతో గురువారం భారత జట్టు ట్రైయినింగ్ సెషన్‌ను రద్దు చేశారు అధికారులు... భారత ఆటగాళ్లు అందరూ ముందుజాగ్రత్తగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. మొత్తానికి ఐదో టెస్టు రద్దు చేసేదాకా వెళ్లింది పరిస్థితి...

ఇంతకీ ఆ రోజు అంత ఆర్భాటంగా మనవాళ్లందరినీ తీసుకుని, రవిశాస్త్రి ఎక్కడికి వెళ్లాడో తెలుసా... తన పుస్తక ఆవిష్కరణ సభకి... దీంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ వస్తోంది...

ఆయన రాసిందేదో మహా గ్రంథం అయినట్టు, ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా తాను వెళ్లిందే కాకుండా, టీమిండియా సభ్యులందరినీ తీసుకెళ్లడం ఏంటని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు...

ఎవరెలా ఆడినా తనకేం సంబంధం లేనట్టు డ్రెస్సింగ్ రూమ్‌‌లో తాగి, కునుకు తీయకుండా పుస్తకాలు రాయడం ఎందుకుని, రాసినదేదో తానొక్కడే వెళ్లి ఉండొచ్చు కదా... అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ముందు రవిశాస్త్రిని ఆ పదవి నుంచి తొలగించాలని, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి కూడా శాస్త్రి కోచ్‌గా ఉంటే, ఇలాంటి ఇబ్బందులే వస్తాయని కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!