విరాట్ వందో టెస్టు: కోహ్లీని సత్కరించిన రాహుల్ ద్రావిడ్... 100వ టెస్టు జ్ఞాపికగా...

Published : Mar 04, 2022, 10:06 AM IST

భారత మాజీ సారథి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఆరంభానికి ముందు విరాట్‌ కోహ్లీని సత్కరించారు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

PREV
111
విరాట్ వందో టెస్టు: కోహ్లీని సత్కరించిన రాహుల్ ద్రావిడ్... 100వ టెస్టు జ్ఞాపికగా...

విరాట్ కోహ్లీ వందో మ్యాచ్‌ను చూసేందుకు ఆయన తల్లి సరోజ్ కోహ్లీ, భార్య అనుష్క శర్మ, కూతురు వామిక కోహ్లీలతో పాటు అన్న వికాస్ కోహ్లీ, తదితరులు హాజరయ్యారు...

211

మ్యాచ్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీని సత్కరించింది బీసీసీఐ. ఈ సమయంలో అనుష్క శర్మ, భర్త పక్కనే నిలబడడం విశేషం...

311

భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేతుల మీదుగా వందో టెస్టు జ్ఞాపికగా ప్రత్యేకంగా రూపొందించిన టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు విరాట్ కోహ్లీ... 
 

411

‘నువ్వు దీనికి పూర్తిగా అర్హుడివి. దీన్ని నీ కష్టంతో సంపాదించుకున్నావ్. ఇది కేవలం ఆరంభం మాత్రమే కావాలి. డ్రెస్సింగ్‌ రూమ్‌లో చెప్పినట్టుగా దీన్ని రెట్టింపు చేయాలి...’ అంటూ విరాట్‌కి జ్ఞాపిక అందచేశాడు రాహుల్ ద్రావిడ్...

511

‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన మూమెంట్. మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, మా అమ్మ, మా ఆవిడ అందరూ ఇక్కడే ఉన్నారు. అందరూ చాలా గర్వంగా ఉన్నారు...

611

క్రికెట్ ఎప్పుడూ టీమ్ గేమే. టీమ్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. బీసీసీఐకి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు క్రికెట్ చాలా బిజీగా మారిపోయింది...

711

మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్ కూడా ఆడుతున్నాం. కానీ నా తర్వాత తరం టెస్టు ఫార్మాట్‌లో నేను 100 మ్యాచులు ఆడాననే విషయాన్ని తీసుకుంటే చాలు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
 

811

ఓవరాల్‌గా 100+ టెస్టులు ఆడిన 71వ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు విరాట్ కోహ్లీ... భారత జట్టు తరుపున 100+ ఆడబోతున్న 12వ క్రికెటర్ విరాట్...

911

ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), వీరేంద్ర సెహ్వాగ్ (103) మ్యాచులు ఆడి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు..

1011

అదీకాకుండా వెస్టిండీస్‌పై 70వ అంతర్జాతీయ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, సెంచరీ లేకుండా 70 ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. లంకపై ఆడబోయే ఇన్నింగ్స్‌ 71వది...

1111

కేప్‌టౌన్ టెస్టుతో 99 టెస్టు ఆడిన విరాట్ కోహ్లీ, 168 ఇన్నింగ్స్‌ల్లో 7962 పరుగులు చేశాడు. విరాట్ టెస్టు యావరేజ్ 50.39గా ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories