జస్ప్రిత్ బుమ్రాకి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్... టీమిండియా నయా కెప్టెన్...

First Published Jul 2, 2022, 6:21 PM IST

రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలడంలో అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను తీసుకున్నాడు స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. తాత్కాలిక సారథిగా బాధ్యతలు తీసుకున్నా... కెప్టెన్‌గా అటు బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ అదరగొట్టాడు జస్ప్రిత్ బుమ్రా...

బ్యాటుతో మెరుపులు మెరిపించి, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 29 పరుగులు రాబట్టి... బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేసిన జస్ప్రిత్ బుమ్రా... ఆ తర్వాత బాల్‌తోనూ సత్తా చాటాడు...

Image Credit: Getty Images

ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆలెక్స్ లీస్, జాక్ క్రావ్లీలను పెవిలియన్ చేర్చిన జస్ప్రిత్ బుమ్రా, తన స్పెల్‌లో మొదటి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా స్పెల్ కారణంగా 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్..

Dravid

టీమిండియాకి టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న 36వ ప్లేయర్‌గా నిలిచాడు జస్ప్రిత్ బుమ్రా. మ్యాచ్ ఆరంభానికి ఒక్క రోజు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బుమ్రాతో మాట్లాడిన విషయాలను బయటపెట్టాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

Image credit: Getty

‘రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకుంటాడా? లేదా? అనే అనుమానాలు రేగుతున్నప్పటి నుంచి అవసరమైతే టెస్టు కెప్టెన్సీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా బుమ్రాకి చెప్పాం...

Image credit: Getty

టెన్షన్ పడకుండా రిలాక్స్‌గా ఉండాల్సిందిగా చెబుతూ వచ్చాను. ఎందుకంటే నువ్వు కెప్టెన్‌గా కంటే బౌలర్‌గానే టీమిండియాకి ఎక్కువ అవసరమనే విషయం బుమ్రాకి చెప్పాను. అతను ఆటను అద్భుతంగా అర్థం చేసుకోగలడు...

Image credit: Getty

ప్లేయర్లను చక్కగా చదవగలడు. అన్నింటికీ మించి టీమ్‌పై అతనికి చాలా గౌరవం ఉంది. కెప్టెన్‌గా ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదే. మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మార్పుల్లో అద్భుతాలు చేయాలని కోరుకోకూడదు...
 

అతనికి కెప్టెన్సీ అనేది కొత్త ఛాలెంజ్. ఓ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా జట్టును నడిపించడం అంత తేలికైన విషయం కాదు. అతను బౌలింగ్‌పైన ఫోకస్ పెడుతూ మిగిలిన అన్ని విషయాలపై కేర్ తీసుకోవాలి. కెప్టెన్సీ అనేది నా వరకూ నీ పనిని నువ్వు మరింత జాగ్రత్తగా మెరుగ్గా చేయడమే... అని చెప్పా...’ అంటూ చెప్పాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
 

కెప్టెన్‌గా ఆడుతున్న మొట్టమొదటి మ్యాచ్‌లోనే పదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ జస్ప్రిత్ బుమ్రా...  ఇంతకుముందు 1976లో అప్పటి భారత సారథి బిషన్ బేడీ 30 పరుగులు చేయడమే ఇప్పటిదాకా అత్యధిక స్కోరుగా ఉంది. 

click me!