విరాట్ లేడు, షమీ ఆడలేడు... రెండు రోజుల ఆధిపత్యం మనదే... టీమిండియాకి ఇది చాలు...

First Published Dec 24, 2020, 4:10 PM IST

తొలి టెస్టులో ఘోర పరాజయం చెందినా... మొదటి రెండు రోజులు టీమిండియాదే ఆధిపత్యం అనే విషయాన్ని గుర్తుంచుకొని, భారత జట్టు రెండో టెస్టులో బరిలో దిగాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. గాయం కారణంగా మహ్మద్ షమీ మిగిలిన టెస్టు సిరీస్‌కి అందుబాటులో ఉండడం లేదని, విరాట్ కోహ్లీ కూడా లేడనే విషయాన్ని భారత జట్టు గుర్తుంచుకుంటే మంచి ఫలితాలు కచ్ఛితంగా సాధించవచ్చని చెప్పాడు గంభీర్.

అవకాశం దొరికినప్పుడల్లా భారత సారథి విరాట్ కోహ్లీని విమర్శించడానికి రెఢీగా ఉండే భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్... ఇప్పుడు రూట్ మార్చుకున్నాడు...
undefined
తొలి టెస్టులో ఘోర పరాజయం నుంచి వెంటనే తేరుకోవాలంటే... టీమిండియా రెండే రెండు విషయాలు గుర్తుంచుకుని బరిలో దిగితే చాలని సూచించాడు గౌతమ్ గంభీర్...
undefined
‘మొదటి టెస్టులో రెండు రోజుల పాటు టీమిండియా ఆధిపత్యమే నడిచింది. కేవలం ఒకే ఒక్క సెషన్‌లో తడబడిన టీమిండియా... ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది...
undefined
అయితే ఓడిపోయింది ఒక్క మ్యాచ్‌లోనే... ఇంకా మూడు టెస్టు మ్యాచులు ఉన్నాయి. మెరుగ్గా రాణిస్తే సిరీస్ కూడా గెలిచేయొచ్చు...
undefined
రెండో టెస్టులో బరిలో దిగే ముందు భారత జట్టు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి... కెప్టెన్ విరాట్ కోహ్లీ లేడు, మహ్మద్ షమీ గాయం కారణంగా ఆడలేడు...
undefined
కాబట్టి ఎలాంటి కాంబినేషన్ తయారుచేస్తారనేదే చాలా ముఖ్యం. అజింకా రహానే చాలా కూల్ క్రికెటర్. అతని పాత్రే ఈ సిరీస్‌లో చాలా కీలకం...
undefined
అజింకా రహానేపై చాలా పెద్ద బాధ్యతే ఉంది. బ్యాటింగ్ కాంబినేషన్‌తో పాటు బౌలింగ్ కాంబినేషన్ ఏర్పరచడం కూడా చాలా ముఖ్యం... ’ అన్నాడు గౌతమ్ గంభీర్.
undefined
డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో అజింకా రహానే సారథ్యంలో బరిలో దిగనుంది టీమిండియా. రహానే కెప్టెన్సీలో ఇది మూడో టెస్టు...
undefined
మొదటి రెండు టెస్టుల్లో భారత జట్టుకి విజయాలు అందించిన అజింకా రహానే, నూరు శాతం విజయాలు సాధించిన అతి తక్కువ మంది కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు...
undefined
click me!