ఆ ఇద్దరికీ అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది... ఫినిషర్లుగా రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌...

First Published Sep 23, 2022, 12:34 PM IST

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సరైన ఫినిషర్ కోసం వెతుకులాడుతూనే ఉంది టీమిండియా. టెస్టుల్లో, వన్డేల్లో రిషబ్ పంత్ ఆ ప్లేస్‌ని భర్తీ చేసినా టీ20ల్లో మాత్రం ఈ యంగ్ వికెట్ కీపర్ నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ రావడం లేదు... ప్రస్తుతం దినేశ్ కార్తీక్‌పైనే ఆశలన్నీ పెట్టుకుంది టీమిండియా...

Dinesh Karthik

ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్, ఫినిషర్‌గా కొన్ని మ్యాచులను కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ప్రస్తుతం కార్తీక్ వయసు 37 ఏళ్లు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి...

Image credit: PTI

‘టీమిండియా కొత్త రక్తాన్ని తయారుచేయాల్సిన సమయం వచ్చేసింది. ఐపీఎల్‌‌లో చాలా టీమ్స్ ఫినిషర్ల కోసం విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డాయి. డేవిడ్ మిల్లర్, టిమ్ డేవిడ్, రోవ్‌మెన్ పావెల్... ఇలా చాలా జట్లకి విదేశీ ప్లేయర్లే మ్యాచ్ ఫినిషర్లుగా ఉన్నారు..

అయితే దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న మన కుర్రాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్లని కనిపెట్టి ఐపీఎల్‌లో ఆడించాలి. అంతకంటే ముందు ఒత్తిడిని ఎదుర్కొంటూ అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్ వంటి కుర్రాళ్లను రాటుతేల్చాలి...

Rahul Tewatia

రాహుల్ తెవాటియా ఒంటి చేత్తో మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. అతను ఏం చేయగలడో ఐపీఎల్ చూసే అందరికీ తెలుసు. అలాగే షారుక్ ఖాన్‌లో కూడా టాలెంట్‌కి కొదువేమీ లేదు. కాబట్టి ఈ ఇద్దరిపై టీమిండియా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది...

అంతర్జాతీయ స్థాయికి కావాల్సినట్టుగా ఈ ఇద్దరినీ మలుచుకోగలిగితే మరో 10 ఏళ్ల పాటు టీమిండియాకి ఫినిషర్ల కొరత ఉండదు... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం... 

click me!