శకునం బాలేదు! ఈసారి కూడా మనోళ్లు గెలవడం కష్టమే... యజ్వేంద్ర చాహాల్‌పై వసీం జాఫర్ కామెంట్...

First Published Sep 23, 2022, 10:57 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సెమీ ఫైనల్ కూడా చేరకపోయినా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో హాట్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగుతోంది భారత జట్టు. దీనికి కారణం రోహిత్ శర్మ ఐపీఎల్ రికార్డు, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌పై ఉన్న భారీ అంచనాలు, అన్నింటికీ మించి ద్వైపాక్షిక సిరీసుల్లో భారత జట్టు చూపించిన ఆటతీరు...

భారత జట్టు ప్రధాన బౌలర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కూడా కొన్ని రోజులుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. టీమిండియా వరుస పరాజయాలకు ఈ ఇద్దరి ఫెయిల్యూరే ప్రధాన కారణం...

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో ఘోరంగా ఫెయిల్ అయిన యజ్వేంద్ర చాహాల్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. అయితే అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో, హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు యజ్వేంద్ర చాహాల్...

Image credit: PTI

గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో యజ్వేంద్ర చాహాల్ చోటు దక్కించుకోలేకపోయాడు. చాహాల్ కంటే రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తిలపైనే ఎక్కువ నమ్మకం ఉంచారు సెలక్టర్లు. ఈ నిర్ణయం టీమిండియాని ఘోరంగా దెబ్బతీసింది...

Chahal

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లోనూ యజ్వేంద్ర చాహాల్ పేలవ ప్రదర్శన ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ 52, హర్షల్ పటేల్ 49 పరుగులు ఇవ్వగా యజ్వేంద్ర చాహాల్ కూడా నేనేం తక్కువ తిన్నానా అంటూ 3.2 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చేశాడు...

Image credit: PTI

యజ్వేంద్ర చాహాల్ కంటే రవీంద్ర జడేజా ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. యజ్వేంద్ర చాహాల్ ఫెయిల్యూర్ టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్..

Yuzvendra Chahal

‘యజ్వేంద్ర చాహాల్‌కి పరిస్థితులు పెద్దగా కలిసి రావడం లేదు. అతను కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నట్టున్నాడు. టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో చాహాల్ ప్రధాన స్పిన్నర్. ఇప్పుడు అతని పర్ఫామెన్స్‌ చూస్తుంటే మంచి శకునంలా కనిపించడం లేదు...

ఒకవేళ ఇదే బౌలింగ్‌తో ఆడితే మాత్రం టీమిండియా మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. యజ్వేంద్ర చాహాల్ కంటే రవి భిష్ణోయ్ చక్కగా బౌలింగ్ చేశాడు. అతను వేసిన ఓవర్లు చాలా కష్టమైనవి, అయినా బ్యాటర్లకు ఎక్కువ పరుగులు ఇవ్వకుండా కంట్రోల్ చేయగలిగాడు...

Ravi Bishnoi

రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టులో ఉన్నాడు. యజ్వేంద్ర చాహాల్ కంటే అశ్విన్ పొదుపుగా బౌలింగ్ వేయగలడు. అయితే అశ్విన్ కంటే కుల్దీప్ యాదవ్, భిష్ణోయ్‌లవైపు చూస్తే బెటర్. యజ్వేంద్ర చాహాల్ ఇలాగే బౌలింగ్ వేస్తూ పోతే... అది భారత జట్టుకి పెద్ద సమస్యే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... 

click me!