అందుకే ఎమ్మెస్ ధోనీని మెంటర్‌గా తెచ్చారు.. కోహ్లీ, రవిశాస్త్రి కలిసి... - మాజీ క్రికెటర్ అతుల్ వాసన్..

Published : Dec 25, 2021, 03:23 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మెంటర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వార్మప్ మ్యాచుల్లో అదరగొట్టిన భారత జట్టు, ఆ తర్వాత కీలక మ్యాచుల్లో ఫెయిల్ అయ్యి, గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది...

PREV
113
అందుకే ఎమ్మెస్ ధోనీని మెంటర్‌గా తెచ్చారు..  కోహ్లీ, రవిశాస్త్రి కలిసి... - మాజీ క్రికెటర్ అతుల్ వాసన్..

వార్మప్ మ్యాచుల్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్... ఎవ్వరూ రాణించినా అంతా మెంటర్ మాహీ మహిమేనంటూ పొగడ్తల్లో ముంచెత్తారు కామెంటేటర్లు...

213

ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే మరో వైపు బౌండరీ లైన్ దగ్గర బ్యాట్స్‌మెన్‌కీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కీ చిట్కాలు చెబుతూ, మెలకువలు నేర్పుతూ తెగ హడావుడి చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

313

అయితే అసలు మ్యాచులు మొదలైన తర్వాత పాకిస్తాన్‌తో, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో చిత్తుగా ఓడింది భారత జట్టు. దీంతో మెంటర్ మాహీ ప్రస్తావన వినిపించలేదు...

413

తాజాగా భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎమ్మెస్ ధోనీని మెంటర్‌గా నియమించడానికి గల కారణాలను వెల్లడించాడు...

513

‘విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కలిసి మొత్తం నడిపిస్తున్నారని జనాలు భావించడం మొదలెట్టారు. ఎవరు ఆడాలి, ఏ పొజిషన్‌లో ఆడాలనేది ఈ ఇద్దరే నిర్ణయించేవాళ్లు...

613

ఫ్యాన్స్‌తో పాటు భారత క్రికెట్ బోర్డు, మేనేజ్‌మెంట్, సెలక్టర్లు కూడా ఇదే ఫీల్ అయ్యారు. అందుకే టీమ్‌లో కాస్త బ్యాలెన్స్ తేవాలనే ఉద్దేశంతో మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీని నియమించారు...

713

భారత క్రికెట్‌ను కంట్రోల్ చేస్తున్న విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల నుంచి జట్టును వేరు చేయాలని ఎత్తుగడ కావచ్చు. అందుకే టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో కీలక మ్యాచులో మాహీ మార్కు మార్పులు చూశాం...

813

విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం కూడా బోర్డు పనే, సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం కాదని నా అభిప్రాయం. సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే, బోర్డు స్పందించే తీరు వేరేగా ఉండేది...

913

నాకు తెలిసి విరాట్ కోహ్లీ, 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. అయితే ఐసీసీ టైటిల్ గెలవకపోవడంతో అతన్ని కెప్టెన్‌గా కొనసాగించడానికి బోర్డు ఇష్టపడలేదు...

1013

అన్నింటికీ మించి విరాట్ కోహ్లీ ఫామ్ కూడా అతని కెప్టెన్సీ పోవడానికి కారణమైంది. ఒకవేళ విరాట్ మంచి ఫామ్‌లో ఉండి ఉంటే, అతను ఐసీసీ టైటిల్ గెలవకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పించే సాహాసం బోర్డు చేసేది కాదు...

1113

అయితే రవిశాస్త్రి కోచ్‌గా తప్పుకోవడం, విరాట్ కోహ్లీ రెండేళ్లుగా పరుగులు చేయలేకపోవడంతో బీసీసీఐకి కెప్టెన్సీ మార్పు చేయడం చాలా తేలికైపోయింది...

1213

విరాట్ కోహ్లీని తప్పిస్తే విమర్శలు వస్తాయని బోర్డుకి తెలియనిది కాదు. అందుకే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించింది...

1313

విరాట్ కోహ్లీ చేయలేకపోయిన పనిని, రోహిత్ శర్మ చేస్తాడని చాలామంది నమ్ముతున్నారు... బీసీసీఐ నమ్మకం కూడా అదే కావచ్చు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్...

Read more Photos on
click me!

Recommended Stories