ఆండ్రూ సైమండ్స్‌తో ‘మంకీగేట్’ వివాదం.. అసలేం జరిగిందో చెబుతానంటున్న హర్భజన్ సింగ్...

Published : Dec 25, 2021, 04:05 PM IST

భారత క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’ వివాదం.. ఓ కుదుపు కుదేపిసింది. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్‌ని, హర్భజన్ సింగ్ ‘మంకీ’ అన్నాడని... ఈ పదానికి జాత్యాహంకారానికి చిహ్నంగా భావించి వేటువేయాలని డిమాండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా...

PREV
114
ఆండ్రూ సైమండ్స్‌తో ‘మంకీగేట్’ వివాదం.. అసలేం జరిగిందో చెబుతానంటున్న హర్భజన్ సింగ్...

2008లో జరిగిన సిడ్నీ టెస్టులో అంపైర్ల నిర్ణయాలు, భారత జట్టుని తీవ్రంగా దెబ్బతీశాయి. అప్పటికే డీఆర్‌ఎస్‌ అమలులో లేకపోవడంతో టీమిండియా నష్టపోవాల్సి వచ్చింది...

214

ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, బ్యాటింగ్‌లో 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 2 వికెట్లు పడగొట్టాడు భజ్జీ...

314

అయితే ఆండ్రూ సైమండ్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన హర్భజన్ సింగ్, తనని కళ్లతో బెదిరించబోయిన ఆసీస్ ఆల్‌రౌండర్‌ని ఏదో అన్నాడు...

414

ఆండ్రూ సైమండ్స్... తనని హర్భజన్ సింగ్ ‘మంకీ’ అన్నాడని ఆరోపించాడు. అయితే హర్భజన్ సింగ్ మాత్రం తాను మంకీ అనలేదని... ‘మా...కీ’ అన్నాడని చెప్పాడు...

514

హర్భజన్ సింగ్‌కి అవతలివైపు నాన్‌స్టైయికింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, ఈ విషయంలో కలుగచేసుకుని... హర్భజన్ ‘మా...కీ’ అన్నాడని, తాను విన్నానని అతనికి సపోర్టుగా నిలిచాడు...

614

ఈ విషయం మీద దాదాపు కొన్ని రోజుల పాటు వివాదం, విచారణ సాగింది. హర్భజన్ సింగ్ ‘మంకీ’ అంటూ సైమండ్స్‌ని తిట్టాడని భావించిన ఆస్ట్రేలియా, అతనికి 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు మూడు మ్యాచుల నిషేధం విధించింది...

714

అయితే అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో టీమిండియా కలిసికట్టుగా హర్భజన్ సింగ్‌కి సపోర్టుగా నిలబడి... భజ్జీపై నిషేధం ఎత్తివేయకపోతే, ఆసీస్ టూర్‌ క్యాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించారు...

814

దీంతో టీమిండియా డిమాండ్‌కి తలొగ్గిన ఆస్ట్రేలియా జట్టు, హర్భజన్‌ సింగ్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ వివాదంపై ఆ మ్యాచ్ రిఫరీ మైక్ ప్రోక్టర్ కూడా ఈ వివాదంలో హర్భజన్ సింగ్‌దే తప్పని ఆరోపించాడు...

914

ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసిన ఆండ్రూ సైమండ్స్... బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

1014

ఆ మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చేతుల్లో 72 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాతి టెస్టు డ్రాగా ముగిసింది...

1114

మంకీ గేట్ వివాదం కారణంగానే తాము తీవ్రంగా నిరుత్సాహానికి లోనయ్యామని, అందుకే ఆ తర్వాతి మ్యాచుల్లో ఓడిపోయామని కామెంట్ చేశాడు అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్...

1214

అప్పటిదాకా స్టార్ ప్లేయర్‌గా ఉన్న ఆండ్రూ సైమండ్స్, మంకీ గేట్ వివాదం తర్వాత ఫామ్‌ కోల్పోయాడు. ఐపీఎల్ ఆడకూడదని నిర్ణయించుకుని, అర్ధాంతరంగా క్రికెట్ నుంచి వైదొలిగాడు...

1314

ఈ వివాదం రేగిన 13 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న హర్భజన్ సింగ్... మంకీ గేట్ వివాదం గురించి కూడా చెప్పుకొచ్చాడు...

1414

‘నేను ఇప్పటిదాకా మంకీగేట్ వివాదంలో నా వాదన వినిపించలేదు. అయితే నా ఆటో బయోగ్రఫీలో ఆ విషయం గురించి పూర్తిగా చెబుతాను...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్. 

click me!

Recommended Stories