టీమిండియా మొత్తంగా మునిగిపోయింది, దాన్ని ఎవ్వరూ కాపాడలేరు... పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్...

First Published Jan 25, 2022, 10:08 AM IST

విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య తలెత్తిన వైరం, భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. సౌతాఫ్రికాలో తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు, ఆ తర్వాత మరో విజయం లేకుండానే టూర్‌ను ముగించాల్సి వచ్చింది...

ముఖ్యంగా గత పర్యటనలో సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో తిరుగులేని విజయాలు అందుకున్న విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పిస్తూ బీసీసీఐ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం... భారత ప్రదర్శనపై తీవ్రంగా ప్రభావం చూపించింది...

2006 తర్వాత తొలిసారి సౌతాఫ్రికాలో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనంతటికీ సఫారీ టూర్‌కి ముందు బీసీసీఐ ప్రారంభించిన రాజకీయాలే కారణమంటూ ట్రోల్స్ వినిపించాయి...

సౌతాఫ్రికాతో టూర్‌కి ముందు కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై విరాట్, ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే...


వన్డే కెప్టెన్సీ కోల్పోయినందుకు ఫీలైన విరాట్ కోహ్లీ, కేప్ టౌన్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్నయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

కోహ్లీ నుంచి వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ కూడా, విరాట్ తీసుకున్న నిర్ణయంతో షాక్‌కి గురయ్యానని చెప్పాడంటే... అతని నిర్ణయం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నాడో అర్థం అవుతోంది...

ఆల్‌టైం బెస్ట్ టెస్టు కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన విరాట్ కోహ్లీ, అర్ధాంతరంగా ఆ పదవి నుంచి తప్పుకోవడంతో పాక్ మాజీ క్రికెటర్లకు అవకాశం దొరికినట్టైంది...

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో గొడవలే కారణమన్న పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్, ఇప్పుడు భారత జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

‘క్రికెట్ గురించి తెలిసిన ఎవ్వరికైనా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి బీసీసీఐతో గొడవలే కారణమని తెలుస్తుంది. ఇది విరాట్ వ్యక్తిగత నిర్ణయమని చెప్పినా, దీని వెనక గంగూలీ ఉన్నాడు...

చూస్తుంటే భారత జట్టు పీకల్లోతు మునిగిపోయినట్టే ఉంది. నిండా మునిగిన పడవను కాపాడడం కష్టం, ఇక దాన్ని రక్షించేవాళ్లు కూడా ఉండరు. ఇప్పుడు టీమిండియా పరిస్థితి కూడా అదే...

వాళ్లు ఏం అనుకున్నారో, అది వర్కవుట్ కాలేదు. విరాట్ కోహ్లీని వన్డేల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే దాదాపు 7-8 ఏళ్లుగా ఓ వ్యక్తి జట్టును నడిపిస్తున్నాడంటే అతని ఆలోచనలు జట్టులో వేళ్లు ఊనుకొనిపోతాయి...

ఆ వేర్లను పీకేయాలని చూస్తే, చెట్టు మొత్తం ఎండిపోయి, చచ్చిపోతుంది. ఇప్పుడు టీమిండియా పరిస్థితి కూడా అంతే. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి వాళ్లేం చేస్తారో చూడాలి...’ అంటూ కామెంట్ చేశాడు రషీద్ లతీఫ్...

click me!