వెంకటేశ్ అయ్యర్ కాదు, హార్ధిక్ పాండ్యాకి అసలైన పోటీ ఆ ఇద్దరితోనే.. ఫినిషర్లుగా దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్!

First Published Jan 24, 2022, 5:39 PM IST

హార్ధిక్ పాండ్యా వెన్నెముక గాయం తర్వాత ఇంతకుముందు రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ మునుపటి రిథమ్ అయితే ఇప్పటిదాకా కనిపించలేదు. ఆ ప్లేస్‌లో సరైన ఆల్‌రౌండర్ ఎవరనే దానికోసం తెగ వెతుకులాడుతోంది టీమిండియా...

వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ యంగ్ ఆల్‌రౌండర్... టీమిండియాకి ఆశాకిరణంలా కనిపించాడు. విజయ్ హాజారే ట్రోఫీలో మనోడు ఇచ్చిన పర్ఫామెన్స్‌కి మెచ్చి, వన్డేల్లోనూ అయ్యర్‌కి అవకాశం కల్పించారు...

అయితే వెంకటేశ్ అయ్యర్‌ను ఎలా వాడుకోవాలో అటు రోహిత్ శర్మకు కానీ, ఇటు కెఎల్ రాహుల్‌కి కానీ తెలియరాలేదు. ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, అయ్యర్‌ను కరెక్ట్‌గా వాడడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి...

కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, వెంకటేశ్ అయ్యర్‌పై పూర్తి భరసా పెట్టి ఓపెనర్‌గా పంపించి, అతని నుంచి ఫియర్‌లెస్ బ్యాటింగ్ తీసుకువస్తే... ద్రావిడ్ ఆ విధమైన ఆటను రాబట్టలేకపోయాడు..

ఇక హార్ధిక్ పాండ్యా రీఎంట్రీపైనే ఆశలు పెట్టుకున్న దశలో ఇద్దరు పేసర్లు, తమలోని ఆల్‌రౌండ్ టాలెంట్‌తో సఫారీ టూర్‌లో అదరగొట్టారు. వాల్లే శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్...

మొదటి వన్డేలో పరాజయం అంచున నిలిచిన భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు శార్దూల్ ఠాకూర్. 43 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

అలాగే రెండో వన్డేలోనూ 38 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో వికెట్ తీయలేకపోయిన శార్దూల్, రెండో వన్డేలో 5 ఓవర్లలో ఓ వికెట్ సాధించాడు...

టెస్టుల్లో పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా మారిన శార్దూల్ ఠాకూర్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అలాంటి పర్ఫామెన్స్ ఇవ్వాలంటే బౌలింగ్ మరింత పదును తేలాల్సిన అవసరం ఉంది...

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ స్థానంలోనే తుది జట్టులోకి వచ్చిన దీపక్ చాహార్, బౌలింగ్‌లో 2 కీలక వికెట్లు తీశాడు... 

అంతేకాకుండా 288 పరుగుల లక్ష్యఛేదనలో 223 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో జస్ప్రిత్ బుమ్రాతో కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 

31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దీపక్ చాహార్, సౌతాఫ్రికాలో భారత జట్టు తరుపున అత్యంత వేగంగా వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌‌మెన్‌గా నిలిచాడు...

అంతకుముందు శ్రీలంక టూర్‌లోనూ ఇలాంటి ఇన్నింగ్స్‌తో భారత జట్టుకి విజయాన్ని అందించాడు. 276 పరుగుల లక్ష్యఛేదనలో 193 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో భువీతో కలిసి 8వ వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు...

82 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్ ఇద్దరూ కూడా ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే టీమ్‌కి ఆడినవాళ్లే కావడంతో వీరిని సరిగా వాడుకోవాలని టీమిండియాని కోరుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!