ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో టీమిండియా వార్మప్... టీ20 వరల్డ్ కప్ 2022 వార్మప్ మ్యాచుల షెడ్యూల్...

Published : Sep 08, 2022, 06:08 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా కథ ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ ఫెవరెట్‌గా అడుగుపెట్టిన భారత జట్టు, ఫైనల్ చేరుకుండానే సూపర్ 4 రౌండ్ నుంచి నిష్కమించింది. దీంతో వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీపైకి ఫోకస్ షిఫ్ట్ చేసే పనిలో పడింది టీమిండియా. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచకప్ 2022 టోర్నీకి వార్మప్ మ్యాచుల షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ...

PREV
16
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో టీమిండియా వార్మప్... టీ20 వరల్డ్ కప్ 2022 వార్మప్ మ్యాచుల షెడ్యూల్...

గత ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో వార్మప్ మ్యాచులు ఆడిన భారత జట్టు, ఈసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వార్మప్ మ్యాచులు ఆడనుంది. బ్రిస్బేన్‌లో అక్టోబర్ 17న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9:30కి మొదలవుతుంది...

26

ఆ తర్వాత అక్టోబర్ 19న బ్రిస్బేన్‌లోనే న్యూజిలాండ్‌తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది... వార్మప్ మ్యాచులను కూడా స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు...

36

2021 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనలిస్టులతో వార్మప్ మ్యాచులు ఆడబోతున్న భారత జట్టు, గ్రూప్ స్టేజీలో అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో తలబడుతుంది. అంటే వార్మప్ మ్యాచులు ముగిసిన తర్వాత టీమిండియాకి నాలుగు రోజుల విశ్రాంతి సమయం ఉంటుంది...

46

ఆ తర్వాత అక్టోబర్ 27న గ్రూప్ క్వాలిఫైయర్‌తో మ్యాచ్ ఆడే భారత జట్టు, అక్టోబర్ 30న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో తలబడుతుంది. ఆ తర్వాత నవంబర్ 6న మరో గ్రూప్ క్వాలిఫైయర్ టీమ్‌తో మ్యాచ్ ఉంటుంది...

56

2021 టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో వార్మప్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది భారత జట్టు. టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లకు చుక్కలు చూపించి... టైటిల్ ఫెవరెట్‌గా పొట్టి ప్రపంచకప్ టోర్నీని ఆరంభించింది...

66
Rishabh Pant

అయితే అసలు మ్యాచుల్లో మాత్రం టీమిండియా నుంచి అలాంటి పర్ఫామెన్స్ రాలేదు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, న్యూజిలాండ్‌పై నిస్తేజమైన ఆటతీరుతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది..ఈసారి వార్మప్ మ్యాచుల్లో ఓడినా అసలు మ్యాచుల్లో సరిగ్గా ఆడితే చాలంటున్నారు అభిమానులు.. 

Read more Photos on
click me!

Recommended Stories