వీళ్లకి ఆ ఫారిన్ కోచ్‌లే కరెక్ట్! మళ్లీ ఆ గ్రెగ్ ఛాపెల్‌ని దింపండి... టీమిండియా ఫ్యాన్స్ కొత్త డిమాండ్...

First Published Sep 8, 2022, 4:45 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా వరుస పరాజయాలను ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు క్రికెట్ ఫ్యాన్స్. దాయాది పాక్ చేతుల్లో, ఆ తర్వాత ఫామ్‌లో లేని లంక చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియాపై ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా భారత జట్టును మళ్లీ గాఢిలోకి తేవాలంటే ఫారిన్ కోచ్‌ రావాలని డిమాండ్ వినబడుతోంది...

2003 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్ చేరినప్పుడు జాన్ రైట్, టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నాడు. జాన్ రైట్ హెడ్ కోచింగ్‌లో టీమిండియా విదేశాల్లో ఘన విజయాలు అందుకుంది. టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించింది..
 

Gary Kirsten

2011లో గ్యారీ కిర్‌స్టన్ హెడ్ కోచింగ్‌లో ఫైనల్ ఫియర్ ఏ మాత్రం లేకుండా వన్డే వరల్డ్ కప్‌ గెలిచింది భారత జట్టు. అయితే ఈ విజయంలో ఎక్కువ క్రెడిట్ ఎంఎస్ ధోనీకి దక్కడంతో కిర్‌స్టన్ ఎక్కువ కాలం కొనసాగలేదు...

ఆ తర్వాత జింబాబ్వే మాజీ ప్లేయర్ డంకన్ ప్లెట్చర్‌ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించింది. ఫ్లెట్చర్ కోచింగ్‌లో 2015 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్‌లో నిష్కమించింది భారత జట్టు. ఈ పరాజయంతో ఫారిన్ కోచ్‌ల మోజు నుంచి టీమిండియా బయటికి రావాలనే వాదన బలంగా వినిపించింది.
 

2015 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫారిన్ కోచ్‌ల జోలికి పోలేదు టీమిండియా. రవిశాస్త్రి, సంజయ్ భంగర్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి.. ప్రస్తుతం రాహల్ ద్రావిడ్ భారత జట్టుకి ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు... భారీ అంచనాలతో హెడ్ కోచ్ పదవి చేపట్టిన ద్రావిడ్, అనవసర ప్రయోగాలతో ఉన్న మంచి పేరును పొగొట్టుకున్నాడు...

ఆసియా కప్ 2022 ఫెయిల్యూర్‌తో మళ్లీ ఫారిన్ కోచ్‌లను తీసుకురావాలనే డిమాండ్ వినబడుతోంది. ముఖ్యంగా గంగూలీ దాదాగిరి నుంచి టీమిండియాని కాపాడిన గ్రెగ్ ఛాపెల్ అయితే... భారత జట్టులో చేయాల్సిన ప్రక్షాళన జరుగుతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

స్వదేశీ కోచ్‌లు ఉన్నంతకాలం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లు సరిగ్గా ఆడినా ఆడకపోయినా టీమ్‌లో ప్లేస్ ఉంటుంది. ఎక్కడికీ పోదు. అదే గ్రెగ్ ఛాపెల్ వంటి హెడ్ మాస్టర్ లాంటి కోచ్ వస్తే... సరిగ్గా ఆడకపోతే తీసి పక్కనబెడతారనే భయం ప్లేయర్లలో పెరుగుతుందని, ఇది సరిగ్గా ఆడడానికి కావాల్సిన కసిని పెంచుతుందని అంటున్నారు...

రోహిత్, రాహుల్ కాంబినేషన్‌లో టీమ్‌లో గెలవాలనే కసి కనిపించడం లేదు. ఆఫ్ఘాన్, పాక్ ప్లేయర్లలో కనిపిస్తున్న కసిలో 10 శాతం కూడా టీమిండియా ప్లేయర్లలో కనిపించడం లేదు. క్యాచ్ వదిలేసిన తర్వాత కూడా ప్లేయర్లు నవ్వుతుండడం, సగటు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆవేదనకి, ఆగ్రహానికి గురి చేస్తోంది...

Rajkot: India cricket team head coach Rahul Dravid with player Rishabh Pant during their training session ahead of their 4th T20 cricket match of the series against South Africa, at Saurashtra Cricket Association Stadium in Rajkot, Thursday, June 16, 2022. (PTI PhotoKunal Patil)(PTI06_16_2022_000210B)

అండర్ 19 టీమ్‌తో సీరియస్‌గా ఉంటూ సక్సెస్ అయిన రాహుల్ ద్రావిడ్, సీరియర్ టీమ్‌తో ఆ విధంగా ఉండలేకపోతున్నాడు. అదీకాకుండా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు చాలా విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చింది బీసీసీఐ. దీంతో ద్రావిడ్‌కి టీమ్‌పై పట్టు తప్పింది...

రాహుల్ ద్రావిడ్ అంటే ప్లేయర్లకు గౌరవం ఉన్నా, భయం అయితే లేదు. అందుకే క్రమశిక్షణ తప్పిన ప్లేయర్లను మళ్లీ సక్రమమైన దారిలోకి నడపాలంటే బెత్తం తీసుకుని, ఆడించే గ్రెగ్ ఛాపెల్ వంటి అతను మళ్లీ  హెడ్ కోచ్ కావాలని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... అప్పుడు కోహ్లీ అయినా, రోహిత్ అయినా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడతారని పోస్టులు చేస్తున్నారు..

click me!