ఇక ఆ సోది చెప్పడం మానేయండి, నోరు మూసుకొని ఆడండి... సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Sep 8, 2022, 3:59 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత రోహిత్ శర్మను కెప్టెన్‌గా, రాహుల్ ద్రావిడ్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అప్పటి నుంచి భారత క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ టీమ్‌ ఫార్ములాని అలవరుచుకుంది. వర్క్ లోడ్ పేరుతో సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం మొదలెట్టింది...

rohit sharma

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో జింబాబ్వేతో సిరీస్ అయినా, ఆస్ట్రేలియాతో సిరీస్ అయినా అతనే కెప్టెన్‌గా ఉండేవాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా ఇదే ఫాలో అయ్యారు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక, ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చాల్సి వచ్చింది టీమిండియా. 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు అజింకా రహానే, శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా... టీమిండియా  కెప్టెన్లుగా వ్యవహరించారు...

కెప్టెన్లు మాత్రమే కాదు ఓపెనింగ్ జోడీ విషయంలో, మిడిల్ ఆర్డర్ విషయంలో అనేక ప్రయోగాలు చేసింది భారత జట్టు. దీపక్ హుడా, సంజూ శాంసన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లను ఓపెనర్లుగా పంపి ప్రయోగాలు చేసిన భారత జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలో మాత్రం ఈ ఏడాది ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని కెఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా పంపింది...


కనీసం స్పిన్నర్లను, వికెట్ కీపర్లను కూడా వరుసగా కంటిన్యూ చేయలేదు భారత జట్టు. కొన్ని సిరీస్‌లకు సంజూ శాంసన్‌ని, మరికొన్ని సిరీస్‌లకు దినేశ్ కార్తీక్‌కు, ఇంకొన్ని మ్యాచులకు ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్‌గా వాడి... కీలక మ్యాచుల్లో పొట్టి ఫార్మాట్‌లో వరుసగా ఫెయిల్ అవుతున్న రిషబ్ పంత్‌పైనే భారం మోపారు...
 

‘ప్రతీ మ్యాచ్‌కి ముందు జట్టును మారుస్తూ పోతే ప్లేయర్లు సింక్‌లోకి రాలేరు. పూర్తి జట్టు వరుసగా మ్యాచులు ఆడుతూ ఉంటే సరైన సింక్ ఏర్పడుతుంది. టీమ్‌లో ప్రయోగాలు చేయడం తప్పు కాదు...
 

Rohit Sharma and KL Rahul

కొన్ని ప్లేస్‌లకు సరైన ప్లేయర్లు లేరు. ఆ పొజిషన్లలో ప్రయోగాలు చేస్తే ఫలితం దొరుకుతుంది. అంతేకానీ ప్రతీ ప్లేస్‌లోనూ ప్లేయర్లతో ప్రయోగాలు చేయడం అనవసరం. అది పిచ్చి పని కూడా... దీని వల్ల సెటిల్ అయిన ప్లేయర్లు డిస్టర్బ్ అవుతారు...

ఇప్పుడు కెఎల్ రాహుల్ విషయంలో అదే జరిగింది. అతను లేడని ఆ ప్లేస్‌లో రకరకాల ప్లేయర్లను ప్రయోగించి చూశారు. అతను తిరిగి వచ్చాక.. ఆ పొజిషన్‌లో సెటిల్ అవ్వడానికి టైమ్ పడుతుంది. కీలక టోర్నీలకు ముందు అతనికి సెటిల్ అయ్యే సమయం కూడా దొరకలేదు...

వర్క్ లోడ్ అంటూ అతన్ని కొన్ని మ్యాచులకు దూరం పెట్టారు. దేశానికి ఆడడం బాధ్యత. అందులో వర్క్‌లోడ్ అనే మాటకు తావులేదు. వర్క్‌లోడ్ తగ్గించుకోవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి. లేదా దేశానికి ఆడలేమని రిటైర్మెంట్ తీసుకోండి...

Image credit: PTI

అంతేకాని వర్క్‌లోడ్ అంటూ సోది మాటలు చెప్పకండి. ఆసియా కప్‌లో ఫైనల్‌కి కూడా వెళ్లలేదు. మీకు ఇంకా 2,3 రోజులు ఎక్స్‌ట్రా రెస్ట్ దొరికింది. ఇకనైనా నోరు మూసుకుని టీమిండియా ఆడే అన్ని మ్యాచులు ఆడండి...’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్...

click me!