200వ టీ20 ఆడుతున్న టీమిండియా... ఆ విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే టాప్...

First Published Aug 3, 2023, 4:37 PM IST

వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు, టీ20 సిరీస్‌ ఆడుతోంది. మూడో వన్డే మ్యాచ్ జరిగిన ట్రినినాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలోనే తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇది భారత జట్టుకి 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం...
 

Sachin Tendulkar

2006లో సౌతాఫ్రికా పర్యటనలో మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్‌‌కి వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సచిన్ టెండూల్కర్, దినేశ్ మోంగియా ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే.

Image credit: Getty

మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడిన సౌతాఫ్రికా టీమ్‌‌లోని ప్లేయర్లు అందరూ ఇప్పటికే రిటైర్ కాగా, భారత జట్టు తరుపున ఆడిన వారిలో దినేశ్ కార్తీక్ ఒక్కడూ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు..
 

Latest Videos


Image credit: Getty

200వ టీ20 మ్యాచ్ ఆడబోతున్న రెండో జట్టు, టీమిండియా. ఇంతకుముందు పాకిస్తాన్ మాత్రమే 223 మ్యాచులతో 200లకు పైగా టీ20 మ్యాచులు ఆడిన టీమ్‌గా ఉంది.  

భారత జట్టు ఇప్పటిదాకా 199 టీ20 మ్యాచుల్లో 130 విజయాలు అందుకుంది. 63 మ్యాచుల్లో ఓడిపోగా, న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా టైగా ముగిసింది. మరో 5 మ్యాచులు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి...

Image credit: PTI

టీమిండియా తరుపున 148 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ 129 టీ20 మ్యాచులతో రెండో స్థానంలో ఉన్నాడు. షోయబ్ మాలిక్ 124 మ్యాచులు ఆడాడు..
 

టీ20 ఫార్మాట్‌లో 4008 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా టాప్‌లో నిలిచాడు. 3853 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు..

టీ20 ఫార్మాట్‌లో 4 అంతర్జాతీయ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉంటే, 38 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ అత్యధిక అర్ధ శతకాలు బాదిన బ్యాటర్‌గా ఉన్నాడు... 

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్ట్రైయిక్ రేటు కలిగిన బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 స్ట్రైయిక్ రేటు 175.76గా ఉంది.

అత్యధిక సార్లు టీ20ల్లో నాటౌట్‌గా నిలిచిన ఘనత మహేంద్ర సింగ్ ధోనీ (42 సార్లు) పేరిట ఉంది.. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (182) బాదిన క్రికెటర్ రోహిత్ శర్మ అయితే, అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డు విరాట్ కోహ్లీ (356) పేరిట ఉంది. 

click me!