14 ఏళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా మొట్టమొదటిసారి... ఐసీసీ మెగా ఈవెంట్‌కి...

First Published Jun 15, 2021, 4:37 PM IST

భారత క్రికెట్ చరిత్రలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోసం స్పెషల్‌గా కొన్ని చాప్టర్లే ఉంటాయి. రెండు వరల్డ్‌కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి టోర్నీలు గెలిచిన మాహీ, భారత జట్టు క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచక్రికెట్‌లోనే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ, గత 14 ఏళ్లలో భారత జట్టు పాల్గొన్న ప్రతీ ఐసీసీ ఈవెంట్‌లోనూ భాగం పంచుకున్నాడు. ఎన్నో విజయాలు, పరాజయాలు చవిచూసిన ధోనీ.. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, ప్లేయర్‌గా సేవలు అందించాడు.
undefined
గత 14 ఏళ్లల్లో మొట్టమొదటిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్ ఆడబోతోంది టీమిండియా. ఫైనల్ మాత్రమే కాదు, ప్లేయర్‌గా కూడా ధోనీ లేకుండా టీమిండియా ఓ ఐసీసీ టోర్నీ ఆడడం గత 14 ఏళ్లల్లో ఇదే తొలిసారి...
undefined
2006 ఛాంపియన్స్ ట్రోఫీ: మహేంద్ర సింగ్ ధోనీ పాల్గొన్న మొట్టమొదటి ఐసీసీ టోర్నీ ఇదే. ఈ టోర్నీలో భారత జట్టు ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
undefined
2007 వన్డే వరల్డ్‌కప్: 2003 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు, భారీ అంచనాలతో 2007 ఐసీసీ వరల్డ్‌కప్‌లో బరిలో దిగింది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడింది. మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.
undefined
మూడేళ్లుగా టీమిండియాలో సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న ధోనీ, 2007 వన్డే వరల్డ్‌కప్‌లో రెండు సార్లు డకౌట్ కావడం, మొత్తంగా టోర్నీలో 29 పరుగులే చేయడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ధోనీ పోస్టర్లను తగులబెట్టి, ఆవేశంతో అతని ఇంటిపై దాడి కూడా చేశారు అభిమానులు.
undefined
2007 టీ20 వరల్డ్‌కప్: సచిన్ టెండూల్కర్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు మొట్టమొదటి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ధోనీ.. కెప్టెన్‌గా అవతారం ఎత్తాడు. 2007 వన్డే వరల్డ్‌కప్ పర్ఫామెన్స్ కారణంగా అండర్‌డాగ్స్‌గా బరిలో దిగిన టీమిండియా, మాహీ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది. ఇక అప్పటి నుంచి ధోనీ శకం మొదలైంది.
undefined
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోనే 2009, 2010టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొంది భారత జట్టు. ఈ మూడు టోర్నీల్లోనూ సెమీస్ కూడా చేరలేక సూపర్ 8 రౌండ్‌తోనే సరిపెట్టుకుంది టీమిండియా...
undefined
2009 ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో భారత జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది. ఈ టోర్నీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ కూడా చేసిన ధోనీ, ట్రావీస్ డాల్విన్‌ను బౌల్డ్ చేసి వన్డేల్లో తన మొట్టమొదటి వికెట్ తీసుకున్నాడు.
undefined
2011 వన్డే వరల్డ్‌కప్: మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు భారీ అంచనాలతో 2011 ఐసీసీ వరల్డ్‌కప్‌లో బరిలో దిగింది. అంచనాలకు తగ్గ పర్ఫామెన్స్‌తో అదరగొట్టి విశ్వ విజేతగా నిలిచింది. 2007లో ప్లేయర్‌గా సాధించలేకపోయిన మాహీ, 2011లో కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలిచి చూపించాడు.
undefined
2012, 14, 16 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లోనూ టీమిండియాలో కెప్టెన్‌గా, సభ్యుడిగా ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2014లో ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన టీమిండియా, 2016లో సెమీఫైనల్‌ నుంచే నిష్కమించింది.
undefined
2015 వన్డే వరల్డ్‌కప్: 2015 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కూడా ధోనీ రనౌట్ కావడం విశేషం.
undefined
2017 ఛాంపియన్స్ ట్రోఫీ: టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కి పీడకల లాంటి మ్యాచ్ ఇది. పాక్ చేతిలో 180 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది టీమిండియా. మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌లో ఉండగా భారత జట్టు ఆడిన చివరి ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఇదే.
undefined
2019 వన్డే వరల్డ్‌కప్: మహేంద్ర సింగ్ ధోనీ చివరిగా ఆడిన అంతర్జాతీయ మ్యాచ్, టోర్నీ ఇదే. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా, గ్రూప్ స్టేజ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడి, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కూడా ధోనీ రనౌట్ కావడం విశేషం.
undefined
2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్: 2006 నుంచి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో, సభ్యుడిగా ప్రతీ ఐసీసీ టోర్నీ ఆడిన భారత జట్టు, గత 14 ఏళ్లల్లో మొట్టమొదటిసారిగా మాహీ లేకుండా ఓ మెగా ఈవెంట్ ఫైనల్ ఆడబోతోంది.
undefined
click me!