డబ్ల్యూటీసీ టోర్నీలో ది బెస్ట్ పర్ఫామెన్స్‌లు ఇవే... అందులోనూ, ఇందులోనూ రెండింట్లోనూ మనమే...

First Published Jun 15, 2021, 3:27 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్‌కి ఇంకా మూడు రోజులే ఉంది. రెండేళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ టోర్నీలో కొన్ని అద్భుతమైన పర్ఫామెన్స్‌లు చూసే అవకాశం క్రికెట్ ఫ్యాన్స్‌కి దక్కింది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవే...

డేవిడ్ వార్నర్: పాకిస్తాన్‌తో 2019లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ 335 పరుగులతో చెలరేగాడు. 418 బంతుల్లో 39 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 335 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డబ్ల్యూటీసీలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు...
undefined
జాక్ కార్లే: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జాక్ కార్లే, పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో 267 పరుగుల భారీ స్కోరు చేశాడు. సౌంతిప్టన్‌లో జరిగిన ఈ టెస్టులో 393 బంతుల్లో 34 ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఈ భారీ స్కోరు చేశాడు కార్లే..
undefined
విరాట్ కోహ్లీ: భారత సారథి విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికాపై పూణెలో జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 336 బంతుల్లో 33 ఫోర్లు, 2 సిక్సర్లతో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన కోహ్లీ, డబ్ల్యూటీసీ టోర్నీలో టీమిండియా నుంచి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
undefined
కేన్ విలియంసన్: వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ 412 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 251 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్ టెస్టు కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
undefined
దిముత్ కరుణరత్నే: శ్రీలంక క్రికెటర్ దిముత్ కరుణరత్నే, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో 437 బంతుల్లో 26 ఫోర్లతో 244 పరుగులు చేశాడు....
undefined
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో టాప్ స్కోరర్లుగా నిలిచిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్ ఇద్దరు మాత్రమే కెప్టెన్లు కావడం, వారి జట్లే ఫైనల్‌కి దూసుకురావడం విశేషం.
undefined
లసిత్ ఎంబ్లూదియా: ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన శ్రీలంక యంగ్ స్పిన్నర్ ఎంబ్లూదియా, టోర్నీలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదుచేశాడు. 42 ఓవర్లు బౌలింగ్ చేసి 137పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు ఎంబ్లూదియా....
undefined
రవిచంద్రన్ అశ్విన్: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు అశ్విన్. అయితే 46.2 ఓవర్లు బౌలింగ్ చేసి 145 పరుగులు ఇవ్వడంతో టోర్నీలో రెండో బెస్ట్ పర్ఫామర్‌గా నిలిచాడు అశ్విన్.
undefined
జస్ప్రిత్ బుమ్రా: వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి సంచలన స్పెల్ వేశాడు జస్ప్రిత్ బుమ్రా...
undefined
స్టువర్ట్ బ్రాడ్: ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, వెస్టిండీస్‌పై 31 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 67 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు బ్రాడ్.
undefined
అక్షర్ పటేల్: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన అక్షర్ పటేల్, మొదటి మ్యాచ్‌లోనే 38 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 70 పరుగులకే 11 వికెట్లు తీసి,... డబ్ల్యూటీసీలో మ్యాచ్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదుచేశాడు.
undefined
బెస్టు బౌలింగ్ ఫిగర్స్ నమోదుచేసిన టాప్ 5 బౌలర్లలో ముగ్గురు భారత బౌలర్లే ఉండగా, మిగిలిన ఇద్దరు బౌలర్ల దేశాలు ఫైనల్‌కి అర్హత సాధించలేకపోవడం విశేషం. బౌలింగ్ అండ్ బ్యాటింగ్‌, రెండింట్లోనూ బెస్ట్ ఫిగర్స్ నమోదుచేసింది టీమిండియా ప్లేయర్లే.
undefined
click me!